లండన్ లోని ఖలిస్తానీ మద్దతుదారులకు షాక్.. రెపరెపలాడుతున్న భారీ త్రివర్ణ పతాకం

by Disha Web Desk 1 |
లండన్ లోని ఖలిస్తానీ మద్దతుదారులకు షాక్.. రెపరెపలాడుతున్న భారీ త్రివర్ణ పతాకం
X

దిశ, వెబ్ డెస్క్: లండన్ లోని భారత హై కమిషన్ కార్యాలయం మీద ఎగురుతున్న జాతీయ జెండాకు ఖలిస్తాన్ వేర్పాటు వాదులు అగౌరపరిచారు. జెండాను దించేస్తుండగా అక్కడ ఉన్న సిబ్బంది గమనించి వెంటనే జెండాను వారి చేతుల్లోంచి లాక్కుని భద్రపరిచారు. అయితే, వీరి చర్యలకు చెంపపెట్టు సమాధానంగా కాసేపటికే జాతీయ జెండాను తిరిగి ఎగురవేశారు. లండన్‌లోని భారత హైకమిషన్ భవనంపై ఇప్పుడు భారీ త్రివర్ణ పతాకం అలంకరించబడింది. లండన్‌లోని ఆల్డ్‌విచ్‌లోని ఇండియా హౌస్‌లో విస్తరించి ఉన్న భారీ జాతీయ జెండా ఫోటో వైరల్‌గా మారింది, సోషల్ మీడియాలో దీనిమీద ప్రశంసలు కురుస్తున్నాయి.

ట్విటర్ పోస్ట్‌లో ఫోటోను పంచుకుంటూ, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్, "ఝండా ఊంచా రహే హమారా"- లండన్‌లోని హైకమిషన్‌లో భారత జెండాను అగౌరవపరిచేందుకు ప్రయత్నించిన దుర్మార్గులపై యూకే ప్రభుత్వం చర్య తీసుకోవాలి. పంజాబ్, పంజాబీలకు దేశానికి సేవ చేయడం/రక్షించడం అనే అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. యూకేలో కూర్చున్న కొన్ని జంపింగ్ జాక్‌లు పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించవు." అంటూ తన అభిప్రయాన్ని వ్యక్త పరిచారు.


“Jhanda Ooncha Rahe Hamara”- UK Govt must act against those miscreants who attempted to disrespect Indian Flag at High Commission,London.Punjab & Punjabis have a glorious track record of serving/protecting the Nation. Handful of jumping jacks sitting in UK do not represent Punjab. pic.twitter.com/TJrNAZcdmf


Next Story

Most Viewed