- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- రాశిఫలాలు
- Job Notifications
టర్కీని కుదేపిసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.8గా నమోదు
by Disha Web |

X
దిశ, వెబ్‌డెస్క్: ఆగ్నేయ టర్కీలోని గాజియాంటెప్ ప్రాంతాన్ని భారీ భూకంపం కుదిపేసింది. సోమవారం సంభవించిన ఈ భారీ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.8గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వీస్ తెలిపింది. కాగా, ఈ భూకంప తీవ్రతకు భారీగా భవనాలు కుప్పకూలాయి. అప్రమత్తమైన సహయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాల్లో నిమగ్నమైపోయాయి. ఈ భూకంపం వల్ల చోటు చేసుకున్న మరణాలు, గాయపడ్డ వారి వివరాలను ఇంకా టర్కీ అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. సోషల్ మీడియాలో మాత్రం భూకంప దాటికి భారీ భవనాలు నేలమట్టం అయిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ భారీ భూకంప తీవ్రతకు టర్కీ చుట్టు పక్కల దేశాల్లోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సిరియా, లెబనాన్, ఇరాక్, ఇజ్రాయెల్, పాలస్తీనా, సైప్రస్ దేశాల్లో సైతం భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు.
Next Story