ఉడకని ఎలుగుబంటి మాంసాన్ని తిన్న కుటుంబం.. మెదడుకు సోకిన పురుగులు

by Harish |
ఉడకని ఎలుగుబంటి మాంసాన్ని తిన్న కుటుంబం.. మెదడుకు సోకిన పురుగులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉడకని ఎలుగుబంటి మాంసాన్ని తిన్న వారి మెదడుకు పురుగులు సోకిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) కొత్త నివేదిక ప్రకారం, అమెరికాలో 2022లో జ్వరం, తీవ్రమైన కండరాల నొప్పులు, కళ్ల చుట్టూ వాపు, ఇతర ఇబ్బందికరమైన సమస్యల వంటి లక్షణాలతో 29 ఏళ్ల వయస్సు కలిగిన ఒక వ్యక్తి తరుచుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. అయితే అతనిని క్షుణ్ణంగా పరిక్షీంచిన తర్వాత మెదడులో పురుగులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీనిని ట్రైకినెలోసిస్ అనే అరుదైన బ్రెయిన్ వార్మ్ ఇన్‌ఫెక్షన్ అని అంటారు. ఈ కేసు వివరాలను CDC నివేదిక తాజాగా విడుదల చేసింది.


దాని ప్రకారం, అమెరికాకు చెందిన ఒక కుటుంబం సౌత్ డకోటాలో ఒక సమావేశానికి హాజరైంది. అక్కడ వారు ఉత్తర సస్కట్చేవాన్ నుండి సేకరించిన నల్ల ఎలుగుబంటి మాంసంతో తయారు చేసిన కబాబ్‌లను తిన్నారు. అయితే అది సరిగ్గా ఉడకకపోవడంతో దాన్ని తిన్న వారందరికీ వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో వారందరిని ఆసుపత్రిలో జాయిన్ చేసి చికిత్స అందించారు. మొదటగా ఆ కుటుంబంలో 29 ఏళ్ల వయస్సు కలిగిన ఒక వ్యక్తి ఆసుపత్రిలో చేరాడు, పరీక్ష తర్వాత అతని మెదడులో పురుగులు ఉన్నట్లు గుర్తించారు. ట్రైకినెలోసిస్ అనే అరుదైన వచ్చిందని వైద్యులు తెలిపారు. ఇది సాధారణంగా అడవి జంతువులను తినడం వల్ల వస్తుంది. దీనిలో ఉండే పురుగు శరీరం గుండా ప్రయాణించి మెదడుకు చేరుతుంది. దీంతో అతనికి చికిత్స అందించారు. ఇతనితో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులు ఇదే కేసుపై ఆసుపత్రిలో చేరారు, వారికి అల్బెండజోల్‌తో చికిత్స ఇచ్చారు. తద్వారా పురుగు శక్తిని కోల్పోయి, చనిపోతుంది. వైద్యులు సరిగ్గా ఉడకని మంసాన్ని తినకూడదని సూచిస్తున్నారు.

Next Story