జింకకు ఆహారం తినిపిస్తూ గొప్ప మనసు చాటుకున్న చిన్నారి..

by Disha Web Desk 9 |
జింకకు ఆహారం తినిపిస్తూ గొప్ప మనసు చాటుకున్న చిన్నారి..
X

దిశ, వెబ్‌డెస్క్: చిన్నపిల్లలు ఏ పని చేసినా మనసుకు ఆనందంగా, అల్లారు ముద్దుగానే అనిపిస్తుంది. అలాంటి ఓ చిన్నారి జంతువులకు ఆహారం తినిపిస్తూ గొప్ప మనసు చాటుకుంది. తన బుజ్జి బుజ్జి చేతులతో ఓ జింకకు ఆహారం తినిపించింది. దాని కోసం ఒంగి మరీ ఎంతో ప్రేమగా జింకకు ఆహారం పెట్టడం చూసి అందరూ ఆశ్యర్యపోతున్నారు. అలాగే గంభీరమైన కొమ్ములతో కూడిన జింక ముందు బాలిక గౌరవంగా నమస్కరించింది. అనంతరం జింక కూడా అమ్మాయి చర్యలకు ప్రతిస్పందించింది.

‘‘ది ఫిగెన్’’ అనే ట్విటర్ అకౌంట్ ద్వారా ఈ వీడియో షేర్ చేశారు. ‘వారిద్దరికి ఒకరి భాష ఒకరికి తెలుసు’ అంటూ వీడియో కింద క్యాప్షన్ రాసుకొచ్చారు. చిన్నారి జింక పట్ల చూపించిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ‘‘వావ్ ఎంత క్యూటో, మంచి ఫ్రెండ్స్‌లా ఉన్నారని ఒకరు, అందం అమాయకత్వం కలబోసినట్లుంది అని మరొకరు ఇలా టన్నుల కొద్ది కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోను 816 మంది వీక్షించారు.

Next Story

Most Viewed