కవలలకు జన్మనిచ్చిన 70 ఏళ్ల వృద్ధురాలు..!

by Anjali |   ( Updated:2023-12-03 08:12:15.0  )
కవలలకు జన్మనిచ్చిన 70 ఏళ్ల వృద్ధురాలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా 40 ఏళ్లు దాటితే సంతానం కలగడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ ఓ మహిళ 70 ఏళ్లలో కవలలకు జన్మనిచ్చి జనాలందరినీ ఆశ్యర్యపరుస్తుంది. వివరాల్లోకెళ్తే.. ఆఫ్రికాకు చెందిన సఫీనా నముక్వాయాకు(70) గతంలో గర్భస్రావం జరిగింది. 1992 లో ఈమె భర్తను కోల్పోయింది. 4 ఏళ్ల తర్వాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే సఫీనాకు పిల్లలు పుట్టకపోవడంతో మానసికంగా కుంగిపోయింది. దీంతో వైద్యుల్ని సంప్రదించగా.. డాక్టర్లు ఆమెను పరీక్షించి.. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ పద్ధతి ద్వారా సంతానం కలిగే చాన్స్ ఉందని చెప్పారు. దీనికి సఫీనా ఒప్పుకోవడంతో, ఐవీఎఫ్ ద్వారా ఆమె గర్భం దాల్చింది. తాజాగా సఫీనా కవలలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒకరు పాప కాగా, మరొకరు బాబు ఉన్నారు. ప్రస్తుతం తల్లితో సహా పిల్లలు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు.

Advertisement

Next Story