28 ఏళ్ల యువకుడికి జాక్ పాట్.. లాటరీలో ఏకంగా రూ. 795 కోట్లు గెలుచుకున్నాడు

by Disha Web Desk 12 |
28 ఏళ్ల యువకుడికి జాక్ పాట్.. లాటరీలో ఏకంగా రూ. 795 కోట్లు గెలుచుకున్నాడు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో ఎక్కడో ఒక చోట అదృష్టం కొంతమందికి కలిసి వచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతుంటారు. మనదేశంలో అయితే ముఖ్యంగా కేరళలో అనేక లాటరీలలో ఇలానే జరుగుతుంది. ఈ క్రమంలోనే ఓ 28 ఏళ్ల యువకుడు జాక్ పాట్ కొట్టాడు. ఈ సారి ఒకటి, రెండు కోట్లు కాదండోయ్.. ఏకంగా 795 కోట్లు లాటరీ గెలుచుకుని కోటీశ్వరుడయ్యాడు. ఈ అనూహ్య సంఘటన చైనా దేశంలో చోటు చేసుకుంది. సౌత్ చైనాకు ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రకారం.. ఈ లాటరీ దేశ చరిత్రలోనే అతిపెద్దది. దీన్ని గెలుచుకున్న 28 ఏళ్ల యువకుడు గుయ్‌ఝౌ ప్రావిన్సులో ఓ చిరువ్యాపారం చేకుంటున్నాడు. ఈ క్రమంలో తాను కొన్న లాటరికి ఈ భారీ ప్రైజ్ మనీ వచ్చింది. ఈ మొత్తాన్ని అతను ఫిబ్రవరి 7న.. ట్యాక్సులు పోను మిగిలిన డబ్బును తీసుకున్నాడు. అయితే ఈ లాటరి డబ్బులను తీసుకోవడానికి ముందు రోజు అంతా అతను నిద్రపోలేదని మీడియాతో ఆనందంగా చెప్పుకొచ్చాడు.


Next Story

Most Viewed