రెట్టింపు సంఖ్యలో దుబాయ్‌ను సందర్శించిన భారతీయులు.. ఎంతంటే!

by Disha Web Desk 17 |
రెట్టింపు సంఖ్యలో దుబాయ్‌ను సందర్శించిన భారతీయులు.. ఎంతంటే!
X

దుబాయ్: భారత్ నుంచి దుబాయ్‌ను సందర్శించిన వారి సంఖ్య రెట్టింపైంది. ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య కాలంలో ఏకంగా 8.58 లక్షల మంది భారత్ నుంచి అరబ్ దేశానికి వెళ్లినట్లు దుబాయ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం(డెట్) పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఇది రెట్టింపు అని తెలిపింది. గత ఏడాది ఇదే సమయంలో 4.09 లక్షల మంది భారత్ నుంచి దుబాయ్ సందర్శించారని వెల్లడించింది. ఇక అంతర్జాతీయంగా ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 71.2 లక్షల పర్యాటకులను దుబాయ్ ఆకర్షించింది. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు మూడింతలని డెట్ తెలిపింది.

'పర్యాటకుల పెరుగుదల ఎమిరేట్ ఆర్థిక వ్యవస్థ చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది. అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలు వేగంగా పెరగడం, ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడానికి దుబాయ్‌ని ట్రాక్‌లో ఉంచుతుంది' అని దుబాయ్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అన్నారు. ఇక 2019లో తొలి ఆరు నెలల్లో 83.6 లక్షల అంతర్జాతీయ పర్యాటకులు దుబాయ్‌ని సందర్శించారు. ప్రాంతాల వారీగా ఈ ఏడాది యూరప్ నుంచి ఎక్కువగా సందర్శకులు వచ్చారని తెలిపింది. కరోనా తర్వాత పర్యాటక రంగం పుంజుకుంటుందని అనుకోవడానికి ఇదే సంకేతమని నిపుణులు పేర్కొంటున్నారు.


Next Story

Most Viewed