చైనాలో ఏటా 64వేల మంది చిన్నారులు మృతి

by Disha Web Desk 17 |
చైనాలో ఏటా 64వేల మంది చిన్నారులు మృతి
X

బీజింగ్: చైనాలో వాయు కాలుష్యం పుట్టబోయే బిడ్డల పాలిట యమపాశం గా మారింది. ఈ కారణంతో ప్రతి ఏటా 64,000 మంది శిశువులు తల్లి కడుపులోనే తుది శ్వాస విరుస్తున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. గత 10 ఏళ్లుగా కాలుష్య నియంత్రణకు స్థానిక ప్రభుత్వం సుదీర్ఘ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మరణాలు తగ్గట్లేదని పేర్కొంది. 137 దేశాల అధ్యయనం ప్రకారం, 2015లో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలో నలభై శాతం ప్రసవాలపై శిలాజ ఇంధనాల దహనంతో ఏర్పడిన పీఎం 2.5కి ప్రభావం చూపింది.

దీని ప్రకారం చైనా నుంచే 98 శాతం భాగస్వామ్యం ఉందని సర్వే పేర్కొంది. పలు దేశాల్లో మెరుగైన గాలి నాణ్యత ప్రపంచ ప్రసవాల భారం తగ్గడానికి కారణం కావచ్చని పెకింగ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అయితే గాలి నాణ్యతను మెరుగుపరచేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు మరో సర్వే పేర్కొంది.


Next Story

Most Viewed