ఆస్ట్రేలియాలో హిందూ మందిరాలపై వ్యతిరేక దాడులు

by Disha Web Desk 17 |
ఆస్ట్రేలియాలో హిందూ మందిరాలపై వ్యతిరేక దాడులు
X

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలో హిందూ మందిరాలపై వ్యతిరేక దాడులు తీవ్రమవుతున్నాయి. మెల్‌బోర్న్‌లోని అల్బర్ట్ పార్క్‌లో ఉన్న హిందూ ఆలయంపై భారత్ వ్యతిరేక నినాదాలు రాశారు. ఈ మధ్య కాలంలో ఇది మూడో ఘటన కావడం గమనార్హం. ఖలీస్తానీ సానుకూల నినాదాలు ఉన్నాయని ఆస్ట్రేలియా స్థానిక కథనాలు పేర్కొన్నారు. పవిత్ర స్థలాన్ని వ్యతిరేక నినాదాలు రాయడం దారుణమని ఇస్కాన్ ఆలయ కమ్యూనికేషన్ డైరక్టర్ భక్త దాస్ అన్నారు.


అంతకుముందు శ్రీ శివ విష్ణు ఆలయం, విక్టోరియాలోని ఆలయంపై కూడా ఈ తరహా నినాదాలు రాసినట్లు చెప్పారు. ఈ ఘటనపై విక్టోరియా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హిందూ కమ్యూనిటీపై విద్వేషపు ఎజెండాను చూపిస్తున్నారని ఆరోపించారు. ఘటనపై ఆస్ట్రేలియా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. భారత విదేశాంగ ప్రతినిధి కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు.



Next Story

Most Viewed