తొక్కిసలాటలో 31 మంది మృతి

by Disha Web |
తొక్కిసలాటలో 31 మంది మృతి
X

లాగోస్: నైజీరియాలో విషాదం చోటు చేసుకుంది. పోర్ట్ హార్కోర్ట్‌‌లోని చర్చిలో శనివారం జరిగిన తొక్కిసలాటలో 31 మంది మరణించట్లు అధికారులు తెలిపారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించాయి. ఒకే సారి వందల మంది గేటు దాటేందుకు ఎగబడటంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువగా చిన్నారులే ఉన్నట్లు చెప్పారు. నైజీరియా సివిల్ డిఫెన్స్ కార్ప్స్ ప్రాంతీయ ప్రతినిధి ఒలుఫెమి అయోడెలీ మాట్లాడుతూ.. బహుమతులను పంపిణీ చేసే క్రమంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో తొక్కిసలాట జరిగిందని అన్నారు. అయితే తొక్కిసలాట జరిగే సమయానికి బహుమతుల పంపిణీ ప్రారంభం కాలేదని చెప్పారు. గేటు మూసి ఉన్న కూడా పెద్ద ఎత్తున జనం తోసుకురావడమే విషాదానికి దారితీసిందని పోలీసులు తెలిపారు.


Next Story