22 year old millionaire | 22 ఏళ్లకే కోటీశ్వరుడైన కుర్రాడు.. చదివింది హైస్కూల్ మాత్రమే!

by S Gopi |   ( Updated:2023-05-08 20:50:48.0  )
22 year old millionaire | 22 ఏళ్లకే కోటీశ్వరుడైన కుర్రాడు.. చదివింది హైస్కూల్ మాత్రమే!
X

దిశ, వెబ్ డెస్క్ : బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. దాంతో జీవితంలో స్థిరపడవచ్చు అనేది నిన్నటి మాట. ఈ రోజుల్లో కుర్రాళ్లు తక్కువ సమయంలో కోట్లు సంపాదిస్తున్నారు. దీనికి ఉదాహరణ అమెరికాకు చెందిన 22 ఏళ్ల హేడేన్ బౌల్స్.

చదువుకు జీవితంలో ఆర్ధికంగా ఎదగడానికి సంబంధం లేదని నిరూపించాడు హేడెన్. అతను 17 ఏళ్లకు చదువు ఆపేశాడు.. అయితే కేవలం ఐదేళ్ళలో అంటే 22 ఏళ్లకు కోట్లకు అధిపతి అయ్యాడు. తాను ఏ పని చేయకపోయినా.. సుఖ సంతోషాలతో జీవితం గడిచిపోయేంత డబ్బును సంపాదించాడు. అదెలాగంటే..

యుఎస్ కు చెందిన హేడేన్ బౌల్స్ 17 ఏళ్ల వయసులో చదువుకు గుడ్ బై చెప్పేశాడు. హైస్కూల్ డ్రాపవుట్ అయినా సరే ఆన్‌లైన్ కోర్సులను నేర్చుకున్నాడు. తాను నేర్చుకున్న విద్యతో ఈకామ్ సీసన్ (EcommSeason) విద్యా సంస్థను ప్రారంభించాడు.హేడేన్ తన విద్యా సంస్థ ద్వారా సంపాదించిన డాలర్లను మళ్ళీ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెట్టాడు.

దీంతో హేడెన్ ఆదాయం అంతకంతకు పెరిగిపోయింది. అలా మిలియన్ల డాలర్లు సంపద చూసి హేడెన్ ఇక సంపాదన చాలు అనుకున్నాడు. బాగా ఆలోచించి రిటైర్మెంట్‌కి ప్లాన్ చేసుకున్నాడు. ఎందుకంటే ఇప్పడు తాను సంపాదించకపోయినా సరే జీవితాంతం సంతోషంగా గడిచిపోయేంత డబ్బు అతని వద్ద ఉంది.

ఇప్పటికే హేడెన్ తన ఆన్ లైన్ విద్యా సంస్థ ద్వారా $4 మిలియన్ల డాలర్లు, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టి $1.5 మిలియన్లను సంపాదించాడట. తనకు వచ్చిన డబ్బులతో ఆధునిక సౌకర్యాల ఇల్లు, లగ్జరీ కారు కొన్నాడు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అంతేకాదు తన సంస్థల ద్వారా సంపాదించిన డబ్బులను తన పార్టనర్‌తో కలిసి పంచుకున్నాడు.

ఎవరైనా హేడేన్ ను చదువు లేకపోయినా.. ఇంత చిన్న వయసులో సక్సెస్ ను ఎలా అందుకున్నావు? ఇందులో రహస్యం ఏమిటి అని ఎవరైనా అడిగితే.. వెంటనే హేడేన్ ”ఒక లక్ష్యంతో పని చేయండి.. చేసే పని ఏదైనా సరే మనసు పెట్టి పూర్తి చేయండి.. మీరు సంపాదించిన దానిలో పొదుపు చేయండి.. పొదుపు చేసిన దానిని మంచి లాభాలు తెచ్చే సంస్థల్లో పెట్టుబడి పెట్టండి. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కేవలం సంపాదన మీదనే దృష్టి పెట్టాలని చెప్పాడు.

చదువుతో సంబంధం లేకుండా ఒక లక్ష్యంతో పనిచేస్తూ జీవితంలో సక్సెస్ అందుకున్న 22 ఏళ్ల హేడెన్ బౌల్స్.. నేటి యువతకు ఆదర్శం అని పలువురు కితాబిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Donald Trump | ప్రత్యర్థి వివేక్ రామస్వామిపై ట్రంప్ పొగడ్తలు!

Advertisement

Next Story