- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు..

దిశ, గుండాల : గుండాల అల్లపల్లి మండలంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. అంతకు ముందు గ్రామ పుర వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి ఆదివాసీల హక్కుల సాధనకు పోరాటాలు మార్గమని పిలుపునిచ్చారు.
గుండాలలో జరిగిన కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు ప్రసంగిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ హక్కులను విస్మరిస్తూ ఏజెన్సీలో ఉన్న వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడం కోసం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. హరితహారం పేరుతో ఆదివాసులు సాగుచేసుకుంటున్న భూములపై అటవీశాఖ అధికారులు నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తూ విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమం కోసం కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా.. ఆచరణలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైందని ఆరోపించారు. అనేక గ్రామాల్లో మౌలిక వసతులు లేక ఆదివాసీలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. విద్య, వైద్యం, ఇతర మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమం కోసం పెద్దపీట వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు.
- Tags
- khammam