కేసీఆర్ ఖబర్దార్.. సర్కార్‌పై ఆగ్రహంతో టవర్ ఎక్కి మహిళల నిరసన

159

దిశ, మహబూబాబాద్ టౌన్ : మహబూబాబాద్ శివారులో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజ్‌లో భూములు కోల్పోతున్న మహిళా రైతులు.. తమకు న్యాయం చేయాలంటూ, తమ భూములు లాక్కోవద్దని గురువారం మధ్యాహ్నం మహబూబాబాద్ కలెక్టరేట్ సమీపంలో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ఖబర్దార్ కేసీఆర్.. ఖబర్దార్ ఖబర్దార్ అంటూ నినాదాలు చేస్తూ టవర్ ఎక్కారు.

మా భూములు లాక్కొని ఎలాంటి పరిహారం చెల్లించకుండా జిల్లా కేంద్రంలోని శాంక్రియాతండా, బాబునాయక్ తండాలోని సర్వే నెంబర్ 551 భూముల్లో దశబ్దాలుగా పూర్వీకుల నుండి ఇప్పటి వరకు జీవనం సాగిస్తున్నారు. ఈ భూమికి వారే పట్టాదారులుగా, కాస్తూదారులుగా రెవెన్యూ రికార్డుల్లో పేర్లు ఉన్నాయి. అయితే.. జిల్లా కేంద్రంలోని భూముల రెట్లు పెరగడంతో మా భూములపై అధికారుల కన్ను పడిందని వారు ఆరోపించారు.

ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, దౌర్జన్యంగా, చట్టవిరుద్ధంగా, కక్ష గట్టి మా భూమిని లాక్కుంటున్నారని గిరిజన రైతులు వాపోయారు. మాకు జీవనధారం అయిన మా భూమిని వదులుకొనే పరిస్థితి వస్తే మాకు ప్రభుత్వం నుంచే పరిహారం ఇప్పించండి. లేకుంటే పోరాటాలకు సిద్ధం అవుతామని గిరిజన రైతులు టవర్ ఎక్కి నిరసన తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..