యువతి కొంపముంచిన డేటింగ్ యాప్..

by  |
యువతి కొంపముంచిన డేటింగ్ యాప్..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ఓ యువతి కొంపముంచింది. పూణెకు చెందిన 26ఏళ్ల వయస్సున్న ఓ యువతి ఏయిర్ హోస్టెస్‌గా పనిచేస్తోంది. తాజాగా టిండర్ ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో ఆమెకు 28 ఏళ్ల అభిజిత్ వాగ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త చనువుగా మారడంతో ఇద్దరు కలిసి డేటింగ్ కోసం రెస్టారెంట్‌కు వెళ్లారు.

తీరా అక్కడికి వెళ్లాక ఆ వ్యక్తి ఆమెను మద్యం తాగాలని బలవంతం చేశాడు. అనంతరం మద్యం మత్తులో ఉన్న యువతిని తన ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మత్తు వదిలాక విషయం తెలుసుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed