రోడ్లపై నాట్లు వేసిన మహిళలు.. ఎందుకంటే ?

by  |
రోడ్లపై నాట్లు వేసిన మహిళలు.. ఎందుకంటే ?
X

దిశ, జిన్నారం : రోడ్డుపై బురద నీటిలో వరినాట్లు వేసి కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు బీసీ కాలనీలో రోడ్లపై వరద నీరు చేరి బురదమయంగా మారడంతో స్థానికులు నిరసన వ్యక్తం చేస్తూ వరినాట్లు వేశారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ గోపాలమ్మ మాట్లాడుతూ.. తన వార్డు సమస్యల పరిష్కారానికి అధికారులు, పాలకవర్గ సభ్యులు చొరవ తీసుకోకపోవడంతో ఆమె స్థానికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. వార్డులో రోడ్ల పరిస్థితి, తాగునీటి, మురుగు కాలువల వ్యవస్థ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అభివృద్ధికి వర్గ విభేదాలను పక్కనపెట్టి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు రాజమణి, కృష్ణవేణి, విజయశాంతి, గీత, సంగీత, మహేశ్వరి, స్థానికులు చక్రపాణి, సత్యనారాయణ, వెంకటేష్, నాని, చారి, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed