'వి హబ్'ను సందర్శించిన మహిళా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ

by  |
వి హబ్ను సందర్శించిన మహిళా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం సారథ్యంలో కొనసాగుతున్న ‘వి హబ్’ని డా. హీనా గవిత్ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ పార్లమెంట్ సభ్యులు సంర్శించారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు స్టార్టప్, వి హబ్ బృందాలతో సంభాషించారు. స్టార్టప్ కంపెనీల ఆలోచనలను, ఉత్పత్తులను అలాగే వి హబ్ ద్వారా హెల్త్‌టెక్, ఇన్‌ఫ్రా, లైఫ్ సైన్సెస్, ఫార్మా, లాజిస్టిక్, ఎఫ్ఎంసీజీ రంగాల్లో కొత్త పరిష్కారాలకు సంబంధించిన వాటిని స్టార్టప్ కంపీనీలు కమిటీ సభ్యులకు చూపించారు. ‘మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడానికి వి హబ్ లాంటి ప్లాట్‌ఫామ్ ఉండటం ఎంతో ప్రోత్సాహకరం. వివిధ రంగాల్లోని మహిళా స్టార్టప్‌లకు చెందిన వినూత్న పరిష్కారాలను గుర్తించి తెలుసుకోవడం సంతోషంగా ఉంది. అంతేకాకుండా వి హబ్ దేశంలోని జమ్మూ కశ్మీర్, గుజరాత్ లాంటి ఇతర రాష్ట్రాల వారితో కలిసి పనిచేయడం ఆసక్తికరంగా ఉందని’ మహిళా సాధికారతపై స్టాండింగ్ కమిటీ గౌరవ అధ్యక్షురాలు డా. హీనా గవిత్ అన్నారు. ‘దేశీయ మహిళా పార్లమెంటేరియన్ సభ్యులు వి హబ్‌ను సందర్శించడం సంతోషంగా ఉంది. స్టార్టప్‌లతో పాటు తమ బృందం మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలతో పాటు సవాళ్లను పరిష్కరించే సూచనలు అందించిందని’ వి హబ్ సీఈఓ దీప్తి రావుల చెప్పారు.


Next Story