పామును హెయిర్ బ్యాండ్‌గా చుట్టుకొని షాపింగ్‌కు వచ్చిన మహిళ

by  |
snake
X

దిశ, ఫీచర్స్ : ఒక విదేశీ మహిళ షాపింగ్ మాల్‌లో నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం నడుచుకుంటూ వెళ్లడంలో వైరల్ అయ్యే విషయం ఏముందని? అనుకోకండి. ఆమె తన కొప్పుకు ఓ పామును రబ్బరు బ్యాండ్‌గా ధరించి మాల్‌లోకి ఎంటర్ అయింది. అయితే ఈ విషయాన్ని ఎవరూ గుర్తించకపోవడం విశేషం. ఇక ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లోని ‘స్నేక్ వరల్డ్’ పేజీలో పోస్టు చేయగా.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

వీడియో విషయానికొస్తే.. సదరు మహిళ తన తలపై చిన్న పామును చుట్టుకుని మాల్‌లోకి ప్రవేశించింది. తన జుట్టును ముడుచుకొని దాని చుట్టూ ఓ పామును రబ్బరు బ్యాండ్‌లా చుట్టింది. ఆమె మాల్ మొత్తం తలపై పాముతోనే తిరుగుతున్నా, దాని తల కదులుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నా.. చుట్టుపక్కల వ్యక్తులెవరూ దాన్ని నిజమైన పాముగా గుర్తించలేదు. ఈ తతంగాన్నంతా ఆమెను ఫాలో అవుతున్న వ్యక్తి వీడియో తీయగా.. బ్యాక్‌గ్రౌండ్‌లో ‘ఎవరికీ తెలియదు’ అంటున్న వాయిస్ వినవచ్చు.

కాలేయంలో పెరుగుతున్న ‘పిండం’.. అరుదైన ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ!

Next Story

Most Viewed