తల్లి కేన్సర్ ట్రీట్ మెంట్ కోసం.. పెయింటింగ్స్ అమ్ముతున్న యువతి

by  |
తల్లి కేన్సర్ ట్రీట్ మెంట్ కోసం.. పెయింటింగ్స్ అమ్ముతున్న యువతి
X

దిశ, వెబ్‌డెస్క్: మనుషుల్ని ఇళ్లకు పరిమితం చేసిన కరోనా.. మానవత్వానికి సరిహద్దులు చెరిపేస్తూ.. సరికొత్త సమాజాన్ని ఆవిష్కరించేలా చేసింది. కరోనా కమ్ముకు వస్తున్నా.. ఎంతోమంది తమ ప్రాణాలను లెక్కచేయకుండా ఎదురొడ్డి పోరాడుతూ మానవత్వపు పరిమళాల్ని వెదజల్లుతున్నారు. మరికొందరు తమ తోటిమనిషి ఆకలి తీరుస్తూ.. మానవసంబంధాలను పెంచుకుంటున్నారు. ఒకరికి సాయం చేయాలన్నా తపన, భావనే మనిషిని, సమాజాన్ని ముందుకు నడిపిస్తోంది. అదే మరోసారి నిరూపితమైంది. అమెరికాకు చెందిన మ్యాబ్స్ అనే యువతి ట్విట్టర్‌లో ఇటీవల వాళ్ల అమ్మకు కేన్సర్ అని ఓ పోస్ట్ పెట్టింది. అమ్మ కేన్సర్ చికిత్స కోసం తన పెయింటింగ్స్ ను అమ్మాలనుకుంటోంది ఆ యువతి. అది చూసిన నెటిజన్లు రిట్వీట్‌లతో, షేర్‌లతో ఆమెకు సాయం చేస్తున్నారు.

అమెరికాకు చెందిన మ్యాబ్స్ ఏప్రిల్ 23న ట్విటర్ లో పోస్ట్ లో ‘మా అమ్మ ఉద్యోగం ఈ మధ్య పోయింది. ఈ రోజే ఆమెకు కేన్సర్ ఉన్నట్లు తెలిసింది. ఆమెకు ఎమర్జెన్సీ సర్జరీ అవసరమని వైద్యులు తెలిపారు. ఆమె ఆపరేషన్ కోసం నేను నా పెయింటింగ్స్ అమ్మి డబ్బులు సమకూర్చాలనుకుంటున్నాను. ఇదిగో నా పెయింటింగ్ ఫోటోలో వాటి ధరలు’ అని రాసుకొచ్చింది. ఆమె వేసిన పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. వాటి ధరలు 20 డాలర్లు నుంచి మొదలుకొని 200 డాలర్ల వరకు ఉన్నాయి. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు .. 18 వేల రీట్వీట్లు చేశారు. 31 వేలమందికి‌పైగా లైక్ చేశారు. ‘మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యావాదాలు. మీరు ఇస్తున్న దైర్యం చూస్తుంటే.. నేను తప్పకుండా మా అమ్మకు అండగా నిలబడతానని నాకు అనిపిస్తుంది. మీకు తెలియదు కానీ… మా అమ్మ చాలామందికి సాయం చేసింది’ అని ఆ యువతి మరో ట్వీట్ చేసింది.

tags : cancer treatment, twitter,sell paintings, moms love

Next Story

Most Viewed