108 అంబులెన్స్‌లో డెలివరీ.. తల్లీబిడ్డ క్షేమం..

by  |
108
X

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: పురిటి నొప్పులతో ఉన్న గర్భిణీని సంగారెడ్డి మాతా శిశు రక్షణ కేంద్రంకు తరలిస్తుండగా 108 వాహనంలోనే ప్రసవించింది. ఈ ఘటన సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. ‘108’ వాహనంలో పనిచేస్తున్న ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ (ఈఎంటీ) శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కంది మండలం కవలంపేట్ గ్రామం నుంచి గురువారం ఉదయం డెలివరీ కేసు ఉందని 108కు కాల్ వచ్చింది. వెంటనే ఆమెను తీసుకొని దగ్గరలో ఉన్న సంగారెడ్డి మాతా శిశు రక్షణ కేంద్రానికి 108 వాహనంలో బయలుదేరారు. అయితే ఆమె మార్గమధ్యలోనే ప్రసవం అయింది. పేషంట్ పేరు పునం దేవి (30), భర్త పేరు కుమార్ అని, ఆమెకు ఇది మూడవ కాన్పు కాగా, డెలివరీ లో మగ బిడ్డ జన్మించాడని, తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉన్నారని ఈఎంటీ తెలిపాడు. కాన్పు తర్వాత వారిని సంగారెడ్డి మాతా శిశు రక్షణ కేంద్రంలో చేర్పించారు.


Next Story

Most Viewed