ముళ్ల పొదల్లో వివాహిత మృతదేహం

by  |
ముళ్ల పొదల్లో వివాహిత మృతదేహం
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతదేహం లభ్యమైంది. మృతదేహం స్థానిక మరాఠీ కాలనీకి చెందిన ఈశ్వర్ భార్య రాజేశ్వరిగా గుర్తించారు. గత రెండు రోజుల క్రితం భర్తతో గొడవ పడి రాజేశ్వరి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆదివారం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ముళ్ల పొదల్లో శవమై తేలింది. రాజేశ్వరి ఒంటి మీద గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story

Most Viewed