అల్లుడితో అత్త రాసలీలలు.. ఓకే ఇంట్లో ఉంటూ చివరికి..

354

దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు బంధాలకు విలువలేకుండా పోతోంది. వావి వరసలు మరిచి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పడక సుఖాల కోసం బంధాలను ఎగతాలి చేసి దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు. అల్లుడంటే సొంత కొడుకుతో సమానం అలాంటి అల్లుడిపై కన్నేసింది ఓ అత్త. కూతురి కోసం ఇంటికి వెళ్లి తన సొంత అల్లుడి తమ్ముడితో అక్రమ సంబంధానికి తెరలేపింది.  అత్తపై కూడా అల్లుడికి మోజు పెరిగింది. ఒకరి మనుసులోని కోరికలు ఒకరు తెలుసుకున్న అత్తా, అల్లుడు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. అయితే అత్త ఆత్మహత్యతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్లితే.. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన సోని అనే మహిళ గత కొన్ని రోజుల నుంచి ఏపీలోని కడప జిల్లా  గూడవాండల్ పల్లెలో నివాసం ఉంటుంది. ఈమె భర్త కొన్ని రోజుల క్రితం గుండె జబ్బుతో మృతి చెందాడు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు ఉండగా, పెద్ద కుమార్తెకు వివాహం చేసింది. ఈ క్రమంలో అప్పుడప్పుడు కూతురు ఇంటికి వెళ్లే సోనికి ఎప్పుడు ఫోజులు కొడుతూ ఉండే తన అల్లుడి సోదరుడిపై కన్ను పడింది. ఆయనకు కూడా అత్త అంటే ఇష్టం పెరిగింది. దీంతో ఇద్దరు వివాహేతర సంబంధం పెట్టుకొని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు. ఈక్రమంలో ఏం జరిగిందో తెలియదు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం సోని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఈ విషయం తన కూతురు, అల్లడుకి తెలియడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.