భర్త చేసిన అప్పును తీర్చాలంటూ భార్యను వారు ఏం చేశారంటే?

by  |
భర్త చేసిన అప్పును తీర్చాలంటూ భార్యను వారు ఏం చేశారంటే?
X

దిశ, మలక్ పేట్: భర్త చేసిన అప్పును తీర్చాలంటూ ఓ మహిళను కొందరు వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేసి పరారైన సంఘటన సైదాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల మరియు పోలీసుల సమాచారం ప్రకారం సైదాబాద్ లోని లోకాయుక్తాకాలనీ నయాగ్రా అపార్ట్ మెంట్ లో మంజుల, పరిమళ్ ఆగర్వాల్ దంపతులు వారి కూతురు, కుమారుడు వుంటున్నారు. పరిమళ్ వ్యాపారాలలో నష్టం రావడంతో తెలిసిన వారి వద్ద లక్షాలాది రూపాయలు అప్పులు చేసి సంవత్సరకాలంగా ఇంటికి రాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.

సోమవారం రాత్రి సమయంలో సుమారు ఆరుగురు వ్యక్తులు మంజుల ఇంటికి వచ్చి డబ్బుల కోసం ఆమెతో గొడవకు దిగారు. మాట్లాడుకుందామని అపార్ట్‌మెంట్‌ బయటకు వెళ్లారు. అపార్ట్‌మెంట్ గేటు ముందు ఆమెతో వారు వాగ్వాదానికి దిగారు. ఆ వాగ్వాదంలో ఒక వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేసి పరారయ్యారు. దీంతో ఆమె సంఘటనా స్థలంలోనే మృతిచెందింది. వెంటనే విషయం తెలుసుకున్న సైదాబాద్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సందర్శించి వివరాలు సేకరించారు. తెలిసిన వ్యక్తులే హత్యకు పాల్పడి ఉండవచ్చని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు

,

Next Story

Most Viewed