ప్రేమ విషాదం.. యువకుడి జీవితం చివరికి అలా ముగిసింది

123
Lover suicide

దిశ, దుబ్బాక: ప్రేమించిన అమ్మాయి మరణించడంతో తీవ్ర మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. దుబ్బాక ఎస్సై మన్నె స్వామి తెలిపిన వివరాల ప్రకారం ధర్మాజీ పేట కు చెందిన బూరు దేవరాజు (20), తన తల్లితో కలిసి కూలిపని చేస్తూ జీవనం కొనసాగించేవాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన అమ్మాయితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాడు. అయితే 2 నెలల క్రితం ఆ అమ్మాయి తీవ్ర అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంటి నుంచి తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుమారుడు రాత్రి అయిన ఇంటికి తిరిగి రాకపోయేసరికి కంగారుపడిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్రంగా గాలించారు. చివరికి పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకుని శవమై కనిపించాడు. గ్రామస్థులు అందించిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి, శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని దుబ్బాక ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి భాగ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ స్వామి తెలిపారు.