క్లౌడ్ టెక్నాలజీలో విప్రో పెట్టుబడులు.. త్వరలో కొత్త లీడర్‌ ప్రకటన

by  |
business news
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ నాలుగో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో రాబోయే మూడేళ్లలో క్లౌడ్ టెక్నాలజీ సామర్థ్యాన్ని పెంచేందుకు 1 బిలియన్ డాలర్లు(రూ. 7,500 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్టు మంగళవారం ప్రకటించింది. తమ వినియోగదారులకు సమగ్రమైన క్లౌడ్ ట్రాన్స్‌ఫర్‌మేషన్ సామర్థ్యాలను అందించేందుకు కొత్తగా “విప్రో ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్ సర్వీసెస్” కార్యక్రమాన్ని కంపెనీ ప్రారంభించింది. ‘ఇటీవల జరుగుతున్న మార్పులలో క్లౌడ్ టెక్నాలజీని ఐటీ రంగం పరివర్తనకు కీలకమైంది. తమ క్లయింట్లకు దాన్ని అందించేందుకు ప్రణాళికను కలిగి ఉన్నామని’ విప్రో మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ థియరీ డెలాపొర్ట్ అన్నారు. క్లౌడ్ సామర్థ్యాన్ని పెంచేందుకు రూ. 7,500 కోట్ల పెట్టుబడులు పెట్టడం, అలాగే విప్రో ఫుల్‌స్టైడ్ క్లౌడ్ సేవలు వంటి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తమ క్లయింట్లకు వేగమంతమైన సేవలను అందించగలమని థియరీ డెలాపొర్ట్ వివరించారు. విప్రో తన కొత్త కార్యక్రమం ఫుల్‌స్టైడ్ క్లౌడ్ సర్వీసెస్‌కు త్వరలో కొత్త లీడర్‌ను ప్రకటించనున్నట్టు విప్రో వెల్లడించింది.

Next Story

Most Viewed