వద్దు వద్దు వైన్స్ షాపులు వద్దు.. రహదారిపై నిరసన

by  |
వద్దు వద్దు వైన్స్ షాపులు వద్దు.. రహదారిపై నిరసన
X

దిశ, పర్వతగిరి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో కొత్తగా ఏర్పడిన మద్యం షాపులు జనం మధ్యలో పెట్టకూడదని, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద పెట్టడం సరికాదని, అల్లూరి సీతారామరాజు సంఘం, ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నాయి. దీనిపై బుధవారం రోజున పర్వతగిరి మండల కార్యదర్శి రమేష్ లిఖితపూర్వకంగా పత్రం అందజేయడం జరిగిందని అల్లూరి సీతారామరాజు సంఘం తెలిపారు.

అదేవిధంగా ప్రజా సంఘాలు అసలు మద్యం షాపులను మండల కేంద్రంలో ఏర్పాటు చేయకుండా మండలానికి ఒక కిలోమీటర్ దూరంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద, వద్దు వద్దు వైన్స్ షాపులు వద్దు అని నినాదాలతో రహదారిపై వాహనాల రాకపోకలకు అవకాశం ఇవ్వకుండా ధర్నా చేపట్టారు. వైన్స్ షాపులు మండల కేంద్రంలో ఉండడం వలన చదువుకునే విద్యార్థులు తాగుడుకు బానిసలవుతున్నారని, మెయిన్ రోడ్డుకు ఉన్నందున తాగిన వారికి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నారు. అందువలన మద్యం షాపులను మండల కేంద్రానికి దూరంలో ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు, అల్లూరి సీతారామరాజు సంఘం, ప్రజలు కోరుతున్నారు.


Next Story

Most Viewed