వైన్స్ లో మృత్యు ఘోష.. ఆగేదెలా..?

by  |
wine shop
X

దిశ, అల్వాల్​: అల్వాల్​ సర్కిల్​ పరిధిలోని వైన్స్ షాపులు మృత్యు గృహాలుగా మారాయి. మద్యం ప్రియులు ఇక్కడికి త్రాగాడానికి వచ్చి మృత్యువు వాత పడుతున్నారు. వారి కేసును పట్టించుకునే వారే లేరు అల్వాల్​ సర్కిల్​ పరిధిలో 8 వైన్స్​లు, 10 బారులు ఉన్నాయి. ఇక్కడ నిత్యం ఎక్కడో ఒక్కచోట ఒక్కరు మృత్యువాత పడుతున్నారు. ఇటీవల ఓల్డ్​ అల్వాల్​ ఐజీ చౌరస్తా వద్దగల దుర్గవైన్స్​ పర్మిట్​రూం లో కొండల్​ అనే వ్యక్తి మృతి చెందాడు, రెండు నెలల క్రితం లోతుకుంట శివ వైన్స్​ పక్కన ఒక్కరు, సుభాష్​నగర్​ తిరుమల వైన్స్​ వద్ద ఒక్కరు ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని కేసులు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడంలేదని మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మనిషి ఎలా చనిపోయాడు.. మద్యం ఎక్కువ త్రాగి చనిపోయాడా..? లేక కల్తీ మద్యం త్రాగి చనిపోయాడా..? లేక గుండెపోటు వచ్చి మరణించాడా..? అనేది తెలపకుండా మృతదేహాన్ని హడావిడిగా తరలించి చేతులు దులిపేసుకుంటున్నారు. వైన్స్​నుంచి శవం దాటిదంటే ఇక కేసు అయిపోయినట్లే అంటున్నారు. బాధితులు అప్పటికే వైన్స్​ యజమానులు ఎవ్వరికి ఇవ్వవలసినవి వారికి ఇచ్చి స్థానిక లీడర్లతో సహా అందరికి పంపించి కేసును మూసేస్తున్నారు. ఇట్లా అల్వాల్​లో పదుల సంఖ్యలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలుపుతున్నారు.

నిబంధనలకు విరుద్దంగా సిట్టింగ్​ రూమ్ లు..

వైన్స్​లలో ప్రభుత్వం కొన్ని నిబంధనలతో సిట్టింగ్ రూమ్ లు ఏర్పాటు చేసుకొనే అవకాశం కల్పించింది ఇదే అదునుగా భావించిన వైన్స్​ యజమానులు విచ్చలవిడిగా సిట్టింగ్​లు ఏర్పాటు చేస్తూ మృత్యువుకు దారులు తెరుస్తున్నారు. క్వాటరో, ఆఫో కొనుక్కొని ఇంటికి పోయి త్రాగవలసిన వారు ఇక్కడే సిట్టింగ్ ఉండడంతో ఒక్కటి త్రాగేవారు రెండు మూడు త్రాగి మృత్యువు వాత పడుతున్నారు. వంద అడుగుల పొడవు.. వంద అడుగుల వెడల్పు ఉండవలసిన సిట్టింగ్ రూమ్ లు, ఎకరాల వెడల్పుతో ఏర్పాటు చేసిన ఎవ్వరు పట్టించుకొనే నాథుడే లేడు.

నిత్యం పర్యవేక్షణ చేయవలసి ఎక్సైజ్​ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడంతో కొన్నిపర్మిట్​ రూంలను చూస్తే మేరీనా బీచ్​ మాదిరిగా కనిపించేలా ఏర్పాటు చేసి నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. ఇది అంత ఎక్సైజ్​ అధికారుల కళ్ల ముందే జరుగుతుంది అయిన ఎలాంటి చర్యలు ఉండవు. వైన్స్​లలో మృత్యువు ఘోష తగ్గాలంటే తక్షణమే పర్మిట్ రూమ్ లను రద్దు చేయాలని స్థానికులు కోరుతున్నారు. తప్పనిసరి అనుకుంటే నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసుకోనే విధంగా ఎక్సైజ్​ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలంటున్నారు స్థానికులు ..

Next Story