విండోస్ ఎక్స్‌పీ సోర్స్ కోడ్ లీక్!

by  |
విండోస్ ఎక్స్‌పీ సోర్స్ కోడ్ లీక్!
X

దిశ, వెబ్‌డెస్క్: పెద్ద పెద్ద రెస్టారెంట్లలో టేస్టీగా ఉండే రెసిపీలలో ఏదో ఒక రహస్య పదార్థం ఉంటుంది. అదేవిధంగా పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలకు సోర్స్ కోడ్ ఉంటుంది. ఆ సోర్స్ కోడ్‌ను ఆసరాగా చేసుకునే ఏ డెవలప్‌మెంట్‌ని అయినా, ఏ ఉత్పత్తిని అయినా ఆ సాఫ్ట్‌వేర్ సంస్థలు అభివృద్ధి చేస్తాయి. అలాగే మైక్రోసాఫ్ట్ వారి విండోస్ ఎక్స్‌పీ ఆపరేటింగ్ సిస్టమ్‌కు కూడా ఒక సోర్స్ కోడ్ ఉంటుంది. ఇప్పుడు ఆ సోర్స్ కోడ్ మొత్తం ఆన్‌లైన్‌లో లీకైంది. కేవలం విండోస్ ఎక్స్‌పీ మాత్రమే కాదు విండోస్ సర్వర్ 2003, ఇంకా ఇతర మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల సోర్స్ కోడ్ కూడా లీకైనట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎక్కడో లీకైందో తెలిసి అందరూ షాకవుతున్నారు. అది ఎక్కడ లీకైందంటే..

4చాన్ వెబ్‌సైట్‌లో ఈ సోర్స్ కోడ్ లీకైంది. ఈ వెబ్‌సైట్‌లో లీకైందంటే ఇది కచ్చితంగా చైనా వారి పనే అయ్యుంటుందని నిపుణులు అనుమానిస్తున్నారు. అయితే విండోస్ ఎక్స్‌పీ సోర్స్ కోడ్ మాత్రమే లీకైందా లేదా దాన్ని వినియోగిస్తున్న వారి సమాచారం కూడా లీకైందా అనే దిశగా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ విండోస్ ఎక్స్‌పీకి సంబంధించిన యూజర్ డేటా కూడా లీక్ అయితే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీల డేటాలు కూడా విండోస్ సర్వర్‌లో ఉంటాయి. దీంతో ఐటీ రంగంలో పెద్ద సంక్షోభమే తలెత్తే అవకాశం ఉంటుంది. మరి ఈ సమాచారం చైనా వారి చేతిలో పడితే ఇక మరిన్ని ఇబ్బందులేనని విశ్లేషకులు అంటున్నారు.

Next Story

Most Viewed