విండీస్‌కు తప్పిన ఫాలోఆన్ గండం

by  |
విండీస్‌కు తప్పిన ఫాలోఆన్ గండం
X

దిశ, స్పోర్ట్స్: రైజ్ ద బ్యాట్ సిరీస్‌లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు డ్రా దిశగా సాగుతోంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 469 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. రెండో రోజు విండీస్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 32 పరుగులు చేసింది. మూడో రోజు ఆట మొత్తం వర్షం కారణంగా తుడిచిపెట్టుకొని పోవడంతో నాల్గో రోజు విండీస్ జట్టు 32/1 ఓవర్ నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించింది. నైట్‌ వాచ్‌మన్‌ అల్జారి జోసెఫ్‌ (32)తో క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌(75) రెండో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. డామ్ బెస్ బౌలింగ్‌లో జోసెఫ్ అవుటవడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన హోప్(24)తో కలిసి బ్రాత్ వెయిట్ 53పరుగులు జోడించాడు. బ్రాత్ వెయిట్ పెవీలియన్ చేరిన తర్వాత బ్రూక్స్ (68), చేజ్ ఆచి తూచి ఆడుతూ 76 పరుగులు జోడించారు. బ్రూక్స్ అవుటయ్యాక బ్లాక్ వుడ్(0), డోరిచ్ (0), హోల్డర్ (2) వికెట్లు కోల్పోవడంతో విండీస్ ఫాలోఆన్ ఆడుతుందని భావించారు. కానీ చేజ్(51) ఫాలో ఆన్ గండాన్ని తప్పించారు. చివరకు విండీస్ 287 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 182 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్ 3, వోక్స్ 3, సామ్ కర్రన్ 2, బెస్, స్టోక్స్ చెరో వికెట్ తీశారు.

స్కోర్ బోర్డ్

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 469/9 డిక్లేర్డ్
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్
బ్రాత్ వెయిట్ 75, జాన్ క్యాంప్‌బెల్ 12, జోసెఫ్ 32, షాయ్ హోప్ 25, బ్రూక్స్ 68, చేజ్ 51, బ్లాక్‌వుడ్ 0, డోరిచ్ 0, జాసన్ హోల్డర్ 2, కీమర్ రోచ్ 5, గాబ్రియేల్ 0 (మొత్తం 287/10, ఎక్స్‌ట్రాలు 17)
వికెట్ల పతనం : 1-16, 2-70, 3-123, 4-199, 5-242, 6-248, 7 – 252, 8-260, 9-287, 10-287



Next Story

Most Viewed