తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు?

by  |
తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు?
X

దిశ, వెబ్‌డెస్క్: హైకోర్టు ఆదేశాలతో కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూ నేటితో ముగియనుంది. ఈ నెల 20 నుంచి 30వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేటితో ముగియనున్న నైట్ కర్ఫ్యూను మరో రెండు వారాలు పొడిగించే అవకాశముంది. నైట్ కర్ఫ్యూ, లాక్‌డౌన్‌పై ఇవాళ సాయంత్రం సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశముంది.

నైట్ కర్ఫ్యూ పొడిగింపు, తదుపరి చర్యలపై చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు?.. ఒక రోజు ముందే ప్రకటిస్తే నష్టమేమిటని గురువారం ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో నైట్ కర్ఫ్యూపై ఇవాళ హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ నివేదించనున్నారు. అటు తెలంగాణలో మినీ లాక్‌డౌన్ విధించే అవకాశముందని వార్తలొస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో లాక్‌డౌన్ అంటూ వస్తున్న వార్తలను ఇప్పటికే రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కొట్టిపారేసిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed