మధ్యప్రదేశ్ సర్కారు బలమెంతా?

by  |

భోపాల్ : ఈ రోజు సాయంత్రం ఐదుగంటలలోపు మధ్యప్రదేశ్ సర్కారు బలపరీక్షను ఎదుర్కోవాల్సి ఉన్నది. అధికారపక్షానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామ చేయడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత బలమున్నది? ఈ బలపరీక్షలో నెగ్గుతుందా? అధికారాన్ని చేజార్చుకుంటుందా? అని అనుమానాలు వస్తున్నాయి.

230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. అసెంబ్లీలో బీజేపీకి 107 సభ్యుల బలముండగా.. కాంగ్రెస్ సర్కారుకు 114 స్థానాల మద్దతు ఉండేది. ఇందులో ఆరుగురు మంత్రుల రాజీనామాలను స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతి ఆమోదించడంతో కమల్ ప్రభుత్వ బలం 114 నుంచి 108కి పడిపోయింది. స్పీకర్‌ను మినహాయిస్తే.. కాంగ్రెస్ సర్కారు బలం 107గా ఉన్నది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం నిన్న రాత్రి మిగతా 16 మంది రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించడంతో ఈ మద్దతు 108 నుంచి 92కు తగ్గింది. 92 కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు ఏడుగురు బీఎస్‌పీ, ఎస్‌పీ, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది. దీంతో అసెంబ్లీలోని మొత్తం 230 స్థానాలకుగాను రెండు ఖాళీలు, 22 సభ్యుల రాజీనామాలతో మెజార్టీ మార్కు 104కు పడిపోయింది. ఈ మార్కుకు సరిపడా బలం కాంగ్రెస్ సర్కారు కోల్పోయింది. కాగా, 107 మంది సభ్యులతో బీజేపీ తిరిగి మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి రాబోయే అవకాశాలున్నాయి.
Tags : madhya pradesh, govt, floor test, majority mark, assembly, resignations, accept, speaker, kamalnath



Next Story

Most Viewed