వైరస్‌తో సహవాసానికి సిద్ధమవ్వాల్సిందే : కేజ్రీవాల్

by  |
వైరస్‌తో సహవాసానికి సిద్ధమవ్వాల్సిందే : కేజ్రీవాల్
X

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ.. లాక్‌డౌన్ ఎత్తేసేందుకు సిద్ధంగా ఉన్నదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వైరస్‌తో సహవాసం చేసేందుకు మనమంతా సిద్ధం కావాల్సిందేనని ఇక్కడ ఓ మీడియా సమావేశంలో చెప్పారు. లాక్‌డౌన్ 3.0లో కేంద్రం ప్రతిపాదించిన సేవలను పునరుద్ధరించనున్నట్టు ఆయన ప్రకటించారు. సోమవారం నుంచి కేంద్రం సూచించిన మినహయింపులు అమల్లోకి వస్తాయని వివరించారు. అయితే, కేంద్రం సూచించిన సడలింపులు సహా మరిన్ని మినహాయింపులకు ఢిల్లీ సిద్ధంగా ఉన్నదని ఆయన సూత్రప్రాయంగా తెలిపారు. కంటైన్‌మెంట్ జోన్ మినహా మిగతా చోట్ల లాక్‌డౌన్ ఎత్తేసినా.. దాన్ని ఎదుర్కొనేందుకు ఢిల్లీ సిద్ధంగా ఉన్నదని వివరించారు. కంటైన్‌మెంట్ జోన్‌ను సీల్ చేసి.. మిగతా ప్రాంతాలను గ్రీన్ జోన్‌లుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతున్నట్టు తెలిపారు. షాపులు సరి-బేసి విధానంలో ఓపెన్ చేయవచ్చునని అన్నారు. ఒకవేళ లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేసినా.. కొన్ని కరోనా కేసులు రిపోర్ట్ అయితే.. వాటిని అదుపులోకి తెచ్చేందుకు తగ్గ మెడికల్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. ఆసాంతం ఢిల్లీని రెడ్ జోన్‌గా ప్రకటిస్తే.. రెండు పెద్ద సమస్యలున్నాయని తెలిపారు. ఒకటి ఢిల్లీలోని చాలా మంది ఆర్థిక పరిస్థితులు దిగజారుతాయని, ఉపాధి కోల్పోతారని, ఢిల్లీ వదిలివెళ్లే పరిస్థితులు తలెత్తవచ్చునని అన్నారు. మరో కారణంగా.. ప్రభుత్వ ఖజానాకు గండిపడుతుందని, సర్కారు దగ్గర డబ్బు లేకుంటే ప్రభుత్వాన్ని ఎలా నడపగలం? జీతాలు ఎలా ఇవ్వగలమని అన్నారు.

tags: delhi, cm arvind kejriwal, containment zone, lockdown, relaxation



Next Story