వాట్సాప్ చెప్పిన ఇద్దరి భార్యల కథ

by  |
వాట్సాప్ చెప్పిన ఇద్దరి భార్యల కథ
X

దిశ, వెబ్ డెస్క్: ఓ యువకుడి కంత్రీ ఆలోచనతో ఇద్దరు యువతులు మోసపోయారు. నెలరోజుల వ్యవధిలోనే ఇద్దరిని వివాహమాడి రెండు జిల్లాల్లో కాపురం చేశాడు. దీనికి కరోనా.. లాక్ డౌన్ ను పూర్తిగా వినియోగించుకోని ఇద్దరు పెళ్లాల కంత్రీ మొగుడిగా నిలిచాడు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో నిజామాబాద్ జిల్లా బోధన మండలం అమ్దాపూర్ గ్రామానికి చెందిన కిషన్, అనురాధ దంపతుల కూతురు కె.మనీషాకు పట్టణంలోని హనుమాన్ టేకిడీ కాలనీకి చెందిన కలేవార్ శ్రీకాంత్‌తో వివాహం జరిగింది. వరుడు హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. పెళ్లి తర్వాత హైదరాబాద్ వచ్చిన శ్రీకాంత్.. లాక్ డౌన్ కు మూడు రోజులు ముందు మంచిర్యాలకు చెందిన వనజను యాదాద్రిలో వివాహం చేసుకుని హైదరాబాద్ లో కాపురం పెట్టాడు. ఇలా నిజామాబాద్, హైదరాబాద్ తిరుగుతూ ఇద్దరితో
సంసారం చేస్తున్నాడు.

ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన శ్రీకాంత్ కు భార్య మనీషా ఫోన్ చేయగా.. రెండో భార్య వజన మాట్లాడింది. ‘ఎవరు మీరు మా ఆయన ఫోన్ ఎత్తారు’అని మనీషా అడగడంతో ‘నేను ఆయన భార్య వనజ’ను సమాధానం ఇచ్చింది. అవాక్కైయిన మనీషా తన పెళ్లి ఫొటోలు ఆమె వాట్సాప్ పంపించి నేనే ఆయన భార్యను అని చెప్పింది. వనజ సైతం తన పెళ్లి ఫొటోలు పంపడంతో ఆమె షాక్ కు గురయింది.

తాను మోసపోయానని గ్రహించిన మనీషా తల్లిదండ్రులకు విషయం చెప్పి బోరుమన్నది. తన భర్త శ్రీకాంత్‌తో పాటు వనజ ఒకే ఆస్పత్రిలో పనిచేస్తున్నారని మనీష చెప్పింది. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శ్రీకాంత్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకోని పోలీసు స్టేషన్‌కు తరలించారు.



Next Story

Most Viewed