వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కల్నల్ సంతోష్ బాబు భార్య

by  |
santosh babu wife
X

దిశ, రాజేంద్రనగర్ : రాష్ట్రంలో వ్యవసాయ రంగం వ్యవసాయ విశ్వవిద్యాలయాల కార్యకలాపాల పై అవగాహన పెంచుకునేందుకు ఇటీవల డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులైన కల్నల్ సంతోష్ బాబు సతీమణి బిక్కుమళ్ల సంతోషి మంగళవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం లోని కమిటీ హాల్ లో, వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ ప్రవీణ్ రావు ఇతర వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన డిప్యూటీ కలెక్టర్ బిక్కుమళ్ల సంతోషికి వ్యవసాయ విశ్వవిద్యాలయ కార్యకలాపాలను ఆమెకు వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ ప్రవీణ్ వివరించారు. రాష్ట్రంలో వరి మొక్కజొన్న పత్తి కంది వేరుశనగ వంటి ప్రధాన పంటలు సాగు చేస్తున్నామని.

వరి పంటలు అధిక ఉత్పత్తి సాధించగా ప్రస్తుతం విలువ జోడింపుపై దృష్టి పెట్టినట్లు ఆమెకు తెలియజేశారు. పత్తి, వేరుశనగ వంటి ప్రధాన పంటలు సాగుచేస్తున్నామన్నారు. అలాగే పత్తి లో అధిక ప్రాధాన్యత కలిగిన నూతన రకాల వంగడాల రూపకల్పనకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఏర్పాటైన అనాది కాలం లోనే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం దేశంలోనే టాప్ టెన్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లో ఒకటిగా నిలిచింది అని వివరించారు. ప్రస్తుతం వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయంలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అమలుకోసం ఆర్టిఫిషీయల్ ఇంటర్ రిజల్ట్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్‌పై అగ్రి హబ్ ద్వారా కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతరం ఆమె రాజేంద్రనగర్ లోని పలు ప్రయోగశాలలను పరిశోధన కేంద్రాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో రిజిస్టార్ సుధీర్ కుమార్ తో పాటు విశ్వవిద్యాలయ ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed