‘కరెంట్’ పేరుతో కుట్రలు.. కేంద్రం ప్లాన్‌పై ప్రొ. నాగేశ్వర్ షాకింగ్ నిజాలు

124

దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలో విద్యుత్ సంక్షోభం రాబోతోందని నేషనల్ మీడియాలో ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం కూడా అప్రమత్తమైంది. హోం మంత్రి అమిత్ షా వెంట వెంటనే సంబంధిత మంత్రులు, అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం ప్రధాన మంత్రి మోడీ కూడా సమావేశం నిర్వహించారు. సమావేశాల అనంతరం విద్యుత్ వినియోగం, మిగులు విద్యుత్ సంబంధిత విషయాలపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది.

అయితే, దీనిపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కూడా స్పందించి రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ సంక్షోభం అనేది రాదని స్పష్టం చేశారు. ఒకవేళ సంక్షోభం వచ్చినా కేంద్రానిదే బాధ్యత అని ప్రకటించారు. ఇలా వివిధ అభిప్రాయాలు వెలువడుతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర రావు ట్విట్టర్‌లో అభిప్రాయాన్ని పంచుకున్నారు. కేంద్రంపై చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు నిజమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆయన చేసిన ట్వీట్ ‘‘ India has an installed power capacity of 3,90,000 MW. The current peak demand is 1,70,000 MW. India has forth largest coal reserves in the world. Why is there coal shortages and worst fears of power outages? Is it not an attempt to blame Coal India so that center can monetize it?’’.

అంటే భారతదేశంలో 3,90,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉండగా.. ప్రస్తుత గరిష్ట డిమాండ్ కేవలం 1,70,000 మెగావాట్లు మాత్రమేనన్నారు. ప్రపంచంలోనే బొగ్గు నిల్వలను కలిగిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉందని.. బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభంపై భయాలు ఎందుకు ఉన్నాయి? అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ కోల్ ఇండియాను నిందించే ప్రయత్నం కాదా, తద్వారా కేంద్రం దానిని మోనటైజ్(ప్రైవేటు) చేయగలదా? అని ఆరోపించారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ముమ్మాటికీ ప్రైవేటీకరణ చేసేందుకే ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..