జగన్ జైలుకెళ్తే.. నెక్స్ట్ సీఎం ఎవరో చెప్పిన షర్మిల

by  |
YS Sharmila
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసేందుకు తాను ఎంతో కృషి చేశానని వైఎస్ షర్మిల అన్నారు. అధికారంలోకి రాకముందు వైసీపీకి తన అవసరం ఉండేదని..తీరా అధికారంలోకి వచ్చాక తన అవసరం లేదన స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారని ఇప్పుడు అన్నీ ఆయనే చూసుకుంటున్నారని అలాంటప్పుడు అక్కడ తన అవసరం ఏముంటుందని అన్నారు. ఓ ప్రముఖ న్యూస్‌ చానెల్‌లో ఆదివారం ప్రసారమైన ఇంటర్వ్యూలో షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకెళ్తే నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారంటూ అడిగిన ప్రశ్నకు షర్మిల చాలా చాకచక్యంగా సమాధానం చెప్పారు. జగన్ సీఎంగా ఉండలేని పరిస్థితి ఏర్పడితే వారి పార్టీ పరంగా, రాజ్యాంగాన్ని అనుసరించి నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు.

ప్రస్తుత కాలంలో రాచరికాలు లేవని, ఓ వ్యక్తి పదవి కోల్పోతే వారి కుటుంబీకులకే ఆ పదవి దక్కాలని ఇప్పుడు ఆశించలేమన్నారు. అన్న లేకపోతే చెల్లెలు అనేది కూడా సరికాదన్నారు. తదుపరి సీఎం ఎవరన్నది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. తాను ఆ పార్టీలో కనీసం సభ్యురాలిని కూడా కాదన్నారు. తనకు ఒక్క పదవి కూడా వచ్చింది కూడా లేదన్నారు. సభ్యత్వం లేకుండానే పాదయాత్ర చేశానని.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని గుర్తు చేశారు. మరోవైపు తన సోదరుడు జగన్ తనను రాజ్యసభకు పంపుతారంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. తాను ఏనాడు పదవులు ఆశించలేదని వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు.



Next Story