టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి.. ఆ మాజీ మంత్రి చూపు ఎటువైపు?

by  |
టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి.. ఆ మాజీ మంత్రి చూపు ఎటువైపు?
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకునేందుకు ఓ మాజీ మంత్రి నిత్యం తపన పడుతూ ఉంటారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడుగా, ఎమ్మెల్యేగా, మాజీ మంత్రి హోదాలో హల్చల్ చేశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత టీఆర్ఎస్లో చేరారు. 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచి ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ఆ సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మాజీ మంత్రి తమ హావా నడిపించారు. ప్రస్తుతం ఆ మాజీ మంత్రి మౌనంగా ఉండటంతో కార్యకర్తల్లో చర్చ సాగుతుంది.

భవిష్యత్ ప్రయాణం ఎటువైపు?

రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలకు అనుగుణంగా నేతలు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఆ మాజీ మంత్రి కార్యకర్తలు, సన్నిహితులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అధికార పార్టీలో అయనకు ప్రాధాన్యత తగ్గినట్లు తెలుస్తుంది. టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన మొదటి వ్యక్తి ఆయనే. ఆ తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వలసలు పెరిగాయి. వికారాబాద్ జిల్లాలోని తాండూర్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యే ఈ దపాలో కాంగ్రెస్ చేతిలో ఓటమి చెందారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినా.. పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. అయితే ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్‌లో చేరడంతో మాజీ మంత్రికి తలనొప్పిగా మారింది. అధిష్టానం ఎమ్మెల్యేలకే నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడంతో మాజీ మంత్రి తిరుగలేకపోతున్నారు. దీంతో ఆ మాజీ మంత్రి రాజకీయ భవిష్యత్తుపై సమాలోచనలు చేస్తున్నారు.

గతంలో బీజేపీలోకి అంటూ ప్రచారం

కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన నేతలతోనే మాజీ మంత్రి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంత్రి సబితా మాజీ మంత్రికి బంధువు అయినప్పటికీ.. రాజకీయంగా విబేధాలున్నాయి. అయితే సబితా రాకతో మాజీ మంత్రి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. అప్పుడు ఆ మాజీ మంత్రి పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను కొట్టి పారేశారు. ఇప్పుడు పీసీసీ పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వడంతో ఆ మాజీ మంతి నిర్ణయం ఎలా ఉండబోతుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు.

Next Story