ఆ ప్లాస్టిక్ అంతా ఎక్కడపోతోంది?

by  |
ఆ ప్లాస్టిక్ అంతా ఎక్కడపోతోంది?
X

దిశ, వెబ్‌డెస్క్:
మహసముద్రాలన్నీ ప్లాస్టిక్‌తో నిండిపోతున్నాయని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచి చెబుతున్నారు. అయితే సముద్రాల్లోకి ప్రతి ఏడాది వెళ్తున్న ప్లాస్టిక్‌లో కేవలం ఒక శాతం మాత్రమే సముద్రం మీద తేలియాడుతూ కనిపిస్తోందట. అయితే మిగతా 99 శాతం ప్లాస్టిక్ మరి ఎక్కడికి వెళ్తోంది?

ఈ మిస్సింగ్ ప్లాస్టిక్ ప్రశ్న ఎప్పట్నుంచో సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది. దీనికి సమాధానం కోసం శాస్త్రవేత్తలు ఇప్పటివరకు గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ వంటి ఓషియానిక్ గైర్లు, మహసముద్రం అడుగుభాగం, సముద్ర జంతువుల కడుపుల్లో వెతికారు. అయితే వీరి పరిస్థితికి సమాధానం దొరికిన తర్వాత చంకలో పిల్లను పెట్టుకుని ఊరంతా వెతికినట్లయిందని శాస్త్రవేత్తలు అనుకున్నారు. సీఎస్ఐఆర్ఓకి చెందిన బ్రిట్టా డెనిస్ హార్డెస్టీ, క్రిస్ విల్కాక్స్‌లు తమ పరిశోధనలో సముద్రంలో పడేసిన దాదాపు 90 శాతం ప్లాస్టిక్ వస్తువులు తిరిగి తీరానికే చేరుతున్నాయని కనిపెట్టారు. ముఖ్యంగా ద్వీపతీరాలకు చేరిన ఈ ప్లాస్టిక్ అక్కడి జీవజాలాన్ని దెబ్బతీస్తోందని వారు అంటున్నారు. బీచ్‌లలో ఉన్న ప్లాస్టిక్ గురించి ఎవరూ పెద్దగా అధ్యయనం చేయలేదు. కానీ దీని వల్లే ఎక్కువ అనర్థాలు జరుగుతున్నాయని క్రిస్ చెబుతున్నారు.

సముద్ర తీరానికి లోపలివైపు 8 కి.మీ.ల దూరంలో ఈ ప్లాస్టిక్ ఎక్కువ శాతం కేంద్రీకృతమై ఉందని వీరి అధ్యయనంలో తేలింది. ఆస్ట్రేలియా సముద్ర తీరాల్లో 2011 నుంచి 2016 వరకు ఈ తీరప్రాంత చెత్త గురించి డేటాను వీరు సేకరించి అధ్యయనం చేశారు. దాదాపు 188 ప్రదేశాల్లో సేకరించిన చెత్తలో 56 శాతం ప్లాస్టిక్ కాగ, 17 శాతం గాజు గ్లాసులు, 10 శాతం నురగ చెత్త ఉన్నాయి. వీటిలో ఎక్కువ బరువు ఉన్నవి సముద్ర తీరానికి దూరంగా, తక్కువ బరువు ఉన్నవి తీరానికి దగ్గరగా చేరుకున్నాయని నివేదికలో తెలిపారు. అంతేకాకుండా నదులు, సముద్రాల్లో కలిచే చోట కూడా ఈ ప్లాస్టిక్ అధికంగా కనిపించిందని వారు అన్నారు. వారి అధ్యయనం వల్ల తీరాల్లో వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రభావవంతగా చేయడానికి వీలవుతుందని క్రిస్ పేర్కొన్నారు.

Tags: plastic, Ocean, Australia, Shore, Off shore, on shore


Next Story

Most Viewed