‘ఓట్లు, సీట్లు తగ్గుతాయన్నప్పుడే.. కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకు వస్తారు’

by  |
‘ఓట్లు, సీట్లు తగ్గుతాయన్నప్పుడే.. కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకు వస్తారు’
X

దిశ, ములుగు : ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్లు, సీట్లు తగ్గుతాయి అనుకున్నప్పుడు మాత్రమే సీఎం కేసీఆర్ కు ప్రజలు సంక్షేమ పథకాలు గుర్తుకొస్తాయని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, అఖిలపక్షం కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. పోడు భూముల పోలి కేక అఖిల పక్ష సమావేశం శనివారం ములుగు జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవన్‌లో సీపీఐఏంఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ కోదండరాం ముఖ్య అతిథిగా పాల్గొని మట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక పోడు భూముల సమస్యను నేను కుర్చీ వేసుకొని పరిష్కరిస్తా అని చెప్పిన కేసీఆర్, కనీసం దాని గురించి మాట్లాడకపోవడం నిజంగా సిగ్గుచేటు అని అన్నారు. పోడు రైతుల హక్కు కోసం అక్టోబర్ 5న రాస్తారోకో కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి మా పోరాట పటిమ రుచి చూపిస్తామన్నారు.

అంతే కాకుండా ఈ నెల 27న జరగపోయే భారత్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలిపు నిచ్చారు. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్త శుద్ది ఉంటే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఈ సమావేశంలో టీజేఏసీ చైర్మన్ చాప బాబు దొర, తెలంగాణ జన సమితి నాయకులు రత్నం కిరణ్ , సీపీఎం రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, తెలుగుదేశం పార్టీ నాయకులు యనల అనతరెడ్డి, సీపీఐ నాయకులు జంపాల రవీందర్, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మేపతి అరుణ్ కుమార్, తుడుం దెబ్బ చింత కృష్ణ, రైతు స్వరాజ్య వేదిక నాయకులు కర్ణాటకం సమ్మయ్య, చంద్రయ్య, ప్రజా సంఘాల నాయకులు ముంజల బిక్షపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed