WhatsApp నుంచి సరికొత్త వాయిస్ మెసేజ్ ఫీచర్

147
whats voice

దిశ, వెబ్‌డెస్క్: WhatsApp ఈ ఏడాది వరుసగా కొత్త కొత్త అప్‌‌డేట్‌లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఈ మధ్యనే రెండు కొత్త ఫీచర్‌లను విడుదల చేసిన వాట్సాప్ ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త అప్‌డేట్‌ను రిలీజ్ చేయనుంది. వాయిస్ నోట్స్ వినడానికి సరి కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. చాట్ విండోను మూసివేసిన తర్వాత కూడా వాయిస్ మెసేజ్‌లు వినడానికి వినియోగదారులను అనుమతించే కొత్త ఫీచర్‌ను యాప్ పరీక్షిస్తోందని కొత్త నివేదిక తెలిపింది. యాప్‌లో ప్రస్తుతం చాట్ విండోలో వాయిస్ మెసేజ్ వినడానికి వినియోగదారులు చాట్ విండోను ఓపెన్ చేసి ఉండాల్సి వచ్చేది. చాట్ విండోను మూసివేసిన తర్వాత, వాయిస్ నోట్ కూడా మూసివేయబడుతుంది. అయితే, రాబోయే ఫీచర్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా వాయిస్ మెసేజ్ ప్లే చేయవచ్చు. వేరే చాట్‌కి మారినప్పుడు మీరు వింటున్న వాయిస్ నోట్ క్లోస్ కాదు. వినియోగదారులు మల్టీ టాస్క్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ iOS బీటా టెస్టర్‌లకు విడుదల చేయబడింది. వాట్సాప్ ఇటీవల వాయిస్ నోట్స్ కోసం ప్లే బ్యాక్ నియంత్రించే ఫీచర్, నోట్‌ను పంపే ముందు ప్రివ్యూ చేసే ఆప్షన్‌ను కూడా తీసుకొచ్చింది.

ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ఇన్నాళ్ల తర్వాత డివోర్స్‌పై చైతూ సంచలన కామెంట్స్