ఇక వాట్సాప్‌లో..మనీ ట్రాన్స్‌ఫర్

by  |
ఇక వాట్సాప్‌లో..మనీ ట్రాన్స్‌ఫర్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారతదేశంలో పేమెంట్ సేవల్ని ప్రారంభించాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. వాట్సాప్ పే సేవలకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఫైనల్లీ వాట్సాప్ పే సేవలు ఇండియాలో లాంచ్ అయ్యాయి.

వాట్సాప్ 20 మిలియన్ల యూజర్లతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేజ్ (UPI) చెల్లింపులను ప్రారంభించింది. ఆ తర్వాత దశల వారీగా పెంచుకోవడానికి ఎన్‌‌పీసీఐ అనుమతి ఇచ్చింది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో వాట్సాప్ పే ఒప్పందం కుదుర్చుకుంది. ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి బీటా టెస్టింగ్ ప్రారంభించింది వాట్సప్. మొత్తంగా 160 సపోర్టింగ్ బ్యాంకులతో వాట్సాప్ దాని సేవలను కొనసాగించనుంది. ‘వాట్సాప్ ద్వారా ప్రజలు మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఓ మెసెజ్ పంపినంత సులువుగా సెక్యూర్ పేమెంట్స్ చేయొచ్చు. లోకల్ బ్యాంక్‌ల అవసరం లేకుండానే ఇంట్లో కూర్చునే..మీ లావాదేవీలను భద్రంగా జరుపుకోవచ్చును’ అని వాట్సాప్ తన బ్లాగ్‌లో రాసుకొచ్చింది.

ఇండియాలో ఇప్పటికే డిజిటిల్ పేమెంట్ మార్కెట్ పలు యాప్‌లతో దూసుకుపోతోంది. పేటీఎం, గూగుల్ పే, వాల్‌మార్ట్ ఐఎన్సీ, ఫోన్ పే, అమెజాన్ పే ఇలా ఎన్నో ఈ రంగంలో తమ సత్తా చాటుతున్నాయి. వీటన్నింటికీ వాట్సాప్ గట్టిపోటీదారు కానుంది. వాట్సాప్‌కు 400 మిలియన్ల యూజర్లు అందుబాటులో ఉన్నారు. 2023 వరకు ఇండియాలో డిజిటిల్ పేమెంట్స్ మార్కెట్ 1 ట్రిలియన్ డాలర్లకు పెరగునుంది.
భారతదేశంలో గూగుల్ పే సేవల్ని కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు అందిస్తున్నాయి. వాట్సాప్ పేమెంట్స్ సేవల్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా- ఎన్‌పీసీఐ (NPCI) 2018 ఫిబ్రవరిలో నిలిపేసిన సంగతి తెలిసిందే. చట్టపరమైన, నియంత్రణ అడ్డంకుల కారణంగా నిలిపివేయగా, ప్రస్తుతం ఆ అడ్డంకులు తొలిగిపోవడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.



Next Story

Most Viewed