వాట్సాప్‌లో గూగుల్ మ్యాప్ తరహా ఫీచర్..!

by  |
వాట్సాప్‌లో గూగుల్ మ్యాప్ తరహా ఫీచర్..!
X

దిశ, ఫీచర్స్: ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తమ వినియోగదారుల కోసం ‘గూగుల్-మ్యాప్స్’ వంటి ఫీచర్‌ను త్వరలో తీసుకురాబోతుంది. ఇది లొకేషన్ ఆధారంగా సమీపంలోని వ్యాపార సంస్థలు, రెస్టారెంట్లను చూపిస్తుంది. బ్రెజిల్, సావో పౌలోలోని కొంతమంది వ్యక్తుల కోసం రూపొందించిన ఈ వాట్సాప్ ట్రాకర్.. భవిష్యత్తులో అందరికీ అందుబాటులోకి రానుందని టెక్నాలజీ న్యూస్‌ ఏజెన్సీ WABetaInfo తెలిపింది. అంతేకాదు ఆన్‌లైన్ స్టేటస్‌ను హైడ్ చేసే ఫీచర్‌పైనా వాట్సాప్ ప్రస్తుతం పనిచేస్తోంది.

వాట్సాప్ వినియోగదారులు ‘హోటళ్లు, రెస్టారెంట్లు, కిరాణా, బట్టల దుకాణాలు లేదా సమీపంలోని ఏదైనా వ్యాపార సముదాయాన్ని ‘వాట్సాప్ ట్రాకర్’ సాయంతో శోధించవచ్చు. ఇందుకోసం వాట్సాప్ సెర్చ్ విభాగంలో ‘బిజినెసెస్ నియర్ బై’ అనే కొత్త విభాగం ఉంటుందని వాబేటాఇన్ఫో పేర్కొంది. ఇది ప్రారంభంలో iOS వినియోగదారులకు మాత్రమే పరిమితమవుతుందని, ఆ తర్వాత ఆండ్రాయిడ్ కస్టమర్స్‌‌కు ఇంట్రడ్యూస్ చేయనుందని సమాచారం.

వాట్సాప్ తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త ఫీచర్స్ ప్రకటించడంతో పాటు వారి ప్రైవసీపై మరింత నియంత్రణను ఇస్తుంది. కానీ ఇప్పటికీ ఆన్‌లైన్ స్టేటస్‌ను డిసేబుల్ చేయగల ఫీచర్ లేకపోవడం గురించి అనేక ఫిర్యాదులు అందినందున వాట్సాప్ త్వరలోనే సంబంధిత ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం ప్రైవసీ సెట్టింగ్స్ > లాస్ట్‌సీన్‌లో ‘Nobody’ సెలెక్ట్ చేశాక యూజర్లు తమ ఆన్‌లైన్ స్టేటస్‌ను హైడ్ చేసే ఆప్షన్ ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ అప్‌డేట్ బీటా దశలోనే ఉండగా.. వాట్సాప్ తదుపరి అప్‌డేట్స్‌లో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశముంది.

Read More : డిసెంబర్ చలిలో.. అందాలను గాలికొదిలేసిన సింగర్



Next Story

Most Viewed