జైల్లో ఐపీఎల్ చూడడం కోసం ఆ ఖైదీలు ఏం చేశారంటే..?

by  |
జైల్లో ఐపీఎల్ చూడడం కోసం ఆ ఖైదీలు ఏం చేశారంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: క్రికెట్ అంటే ఇష్టముండని వారుండరు.. క్రికెట్ సీజన్ వచ్చిందంటే అభిమానులు టీవీ లకు అతుక్కుపోతారు. ఆ టైమ్ లో ఏం జరిగినా పట్టించుకోరు. ఇక ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే క్రికెట్ అభిమానులను తట్టుకోవడం కష్టమే…అయితే క్రికెట్ అంటే పిచ్చి మీకేనా.. మాకు ఉండదా? అంటున్నారు ఖైదీలు. జైల్లో ఉంటే మాత్రం క్రికెట్ చూడకూడదా? మాకోసం కూడా టీవీ పెట్టించండి.. ఐపీఎల్ చూడాలి అంటూ ధర్నాకు దిగారు. ఇప్పటివరకు జైల్లో ఆహరం బాలేదనో, ఇతర సౌకర్యాలు బాలేవనో ధర్నా చేసినవాళ్ళం చూసి ఉంటాం. కానీ ఐపీఎల్ మ్యాచులు చూడడానికి ఖైదీలందరు కలిసి ధర్నా చేపట్టిన వింత సంఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌, ఫతేగఢ్ సెంట్రల్ జైలులోని కొంతమంది ఖైదీలు క్రికెట్ కి వీరాభిమానులు. ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటి నుండి జైలు అధికారులను ఒక టీవీ పెట్టమని, అందులో తాము మ్యాచెస్ చూస్తామని కోరారు. ఈ విషయాన్ని జైలు అధికారులు మాత్రం లెక్కలోకి తీసుకోలేదు. క్రికెట్ మ్యాచ్ లు స్టార్ట్ అయ్యి కూడా చాలా రోజులు అవుతుంది. ఎలాగైనా మ్యాచ్ చూడాలని నిశ్చయించుకున్న ఖైదీలు ధర్నాకు దిగారు. జైలు మధ్యలో కూర్చొని నిరసన చేపట్టారు. తమ కోసం టీవీలు తెచ్చి, క్రికెట్ మ్యాచ్ లు పెట్టేవరకు కదిలేది లేదని భీష్మించుకూర్చున్నారు. దీంతో జైలు సూపరిండెంట్ ఖైదీల డిమాండ్ తీరుస్తామని, త్వరలోనే టీవీలు ఏర్పాటు చేస్తామని తెలుపడంతో ఖైదీలు శాంతించారు. క్రికెట్ అంటే అభిమానం ఉండొచ్చు కానీ మరీ ఇంత పిచ్చి ఉండడమేంటని జైలు అధికారులు నోరెళ్లబెడుతున్నారు. ఏదిఏమైనా ఖైదీలు మాత్రం ఇకనుండి క్రికెట్ మ్యాచ్ లు చూడొచ్చని సంతోషిస్తున్నారు.



Next Story

Most Viewed