కేసీఆర్ పర్యటనలో ఆ యువ కానిస్టేబుల్ ఇలా చేశాడేంటీ…?

by  |
కేసీఆర్ సిద్దిపేట
X

దిశ ప్రతినిధి, మెదక్ : సిద్దిపేటలో సీఎం పర్యటన సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ నేతృత్వంలో 1,250 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం సిద్దిపేటకు చేరుకున్న కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, సీపీ ఆఫీస్, కలెక్టర్ కార్యాలయం ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమయంలో డ్యూటీ చేస్తున్న యువ కానిస్టేబుల్ పాపం అలసిపోయాడేమో… సీఎం సమావేశం ముగిసే వరకు కాస్త విశ్రాంతి తీసుకుందామని ద్విచక్ర వాహనం పైనే సేద తీరాడు. కానిస్టేబుల్ సేద తీరుతున్న ఫోటోను అక్కడున్న వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో వైరల్ అయింది. సీఎం పర్యటనలో అనుక్షణం అలర్ట్ గా ఉండాల్సిన కానిస్టేబుల్ నిర్లక్ష్యం వహించడం ఏంటని, ఇతని పై సీపీ చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

siddipet police constable

Next Story

Most Viewed