వైద్య పరీక్షలు.. చార్టెడ్ ఫ్లైట్.. బయోసెక్యూర్ ట్రైనింగ్

by  |
వైద్య పరీక్షలు.. చార్టెడ్ ఫ్లైట్.. బయోసెక్యూర్ ట్రైనింగ్
X

దిశ, స్పోర్ట్స్ : కరోనా లాక్‌డౌన్ అనంతరం జరగబోతున్న చారిత్రాత్మక టెస్టు సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు సోమవారం రాత్రి విండీస్ నుంచి బయలుదేరింది. జాసన్ హోల్డర్ నేతృత్వంలోని జట్టు సభ్యులు, కోచ్, ఇతర సిబ్బందికి కొవిడ్-19కి సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆంటిగ్వా నుంచి చార్టెడ్ ఫ్లైట్ ద్వారా మాంచెస్టర్‌కు బయలుదేరారు. వీళ్లు ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఏర్పాటు చేసిన బయో సెక్యూర్ వాతావరణంలో మూడు వారాల పాటు శిక్షణ శిబిరంలో పాటు పాల్గొంటారు. అనంతరం జులై 3న సౌతాంప్టన్‌ వెళ్తారు. కాగా, వైద్య పరీక్షల్లో అందరు ఆటగాళ్లు, సిబ్బందికి కరోనా నెగెటివ్ వచ్చినట్లు వెల్లడించారు. ఇక విండీస్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ టీంతో మంగళవారం వచ్చి చేరతారు. ఆయన లండన్‌ నుంచి ఓల్డ్ ట్రాఫోర్డ్ రానున్నారు. కాగా, వెస్టిండీస్ పర్యటనకు యూకే ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల అనుమతులు ఇచ్చింది.

Next Story

Most Viewed