బుధవారం పంచాంగం, రాశిఫలాలు (16-06-2021)

by  |
Panchangam
X

ప్రదేశము : హైదరాబాద్, ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : బుధవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : షష్టి (నిన్న రాత్రి 10 గం॥ 54 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 42 ని॥ వరకు)
నక్షత్రం : మఖ (నిన్న రాత్రి 9 గం॥ 40 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 11 ని॥ వరకు)
యోగము : హర్షణము
కరణం : కౌలవ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 9 గం॥ 55 ని॥ నుంచి 11 గం॥ 33 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 7 గం॥ 43 ని॥ నుంచి 9 గం॥ 21 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 49 ని॥ నుంచి మధ్యాహ్నం 12 గం॥ 41 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 15 ని॥ నుంచి 1 గం॥ 53 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 37 ని॥ నుంచి మధ్యాహ్నం 12 గం॥ 15 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 19 ని॥ నుంచి 8 గం॥ 57 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 41 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 51 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : సింహము

మేష రాశి : దేవాలయాలను సందర్శిస్తారు. దీని వలన మానసిక ప్రశాంతత మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆఫీస్ పనులలో అధిక శ్రమ, ఒత్తిడి. పనులు పూర్తి కావాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. వ్యాపారంలో సరుకులను, లెక్కలను ఒకసారి చూసుకోండి కింది వారిని పూర్తిగా నమ్మకండి అహంభావంతో భార్యను చులకనగా చూడకండి. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. బయటి భోజనం కన్నా ఇంటి భోజనం మిన్న. అధిక శ్రమ వలన తలనొప్పి రావచ్చు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త తప్పులను ఈ రోజుకు క్షమించి చూడండి.

వృషభ రాశి : అనుకున్న కార్యాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇంతకాలం పడుతున్న మానసిక చికాకులు తొలగిపోతాయి. ఆఫీసులో పనులను చాకచక్యంగా పూర్తిచేస్తారు. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. విదేశాలకు వెళ్లి చదవాలనుకునే విద్యార్థులకు అనుకోని అవాంతరాలు. నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కావాల్సినంత ధనం చేతికందుతుంది పొదుపు చేస్తారు. అనుకోని అతిథుల రాక వలన మీ పనులు ఆలస్యం అవుతాయి. నిరుద్యోగులకు శుభవార్త. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మిధున రాశి : సహోదరుల, బంధువుల, స్నేహితుల సహకారం లభిస్తుంది. అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలలో వస్తువులు జాగ్రత్త. బంధువులను పరామర్శిస్తారు. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ కావడం వల్ల మానసిక అశాంతి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అధిక శ్రమ వలన కాళ్ల నొప్పులు. యోగా లేక జిమ్ ఒక మంచి ఉపాయం ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

కర్కాటక రాశి: పట్టుదల సహనంతో అన్ని కార్యాలను పూర్తి చేస్తారు. అడగకముందే ఎవరికీ ఉచిత సలహాలు ఇవ్వకండి. ఏ చిన్న తప్పు జరిగినా మీరు టెన్షన్ పడవలసి వస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. కొత్తగా పెట్టుబడులు పెట్టబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయండి. ఆఫీసు పనులలో అధిక శ్రమ ఉన్నప్పటికీ సరైన ప్రణాళికతో పనులు పూర్తి చేస్తారు. మీ సొంత నిర్ణయాలు లాభిస్తాయి. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ముఖ్య అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టండి.ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఆనందించండి.

సింహ రాశి : పట్టుదల మరియు సహనంతో అన్ని కార్యాలను పూర్తి చేస్తారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. దేవాలయాల సందర్శన మరియు దైవ ప్రార్ధన వలన మానసిక ప్రశాంతత. ఆఫీసులో పనులు పూర్తి కావాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఒత్తిడిని వదిలివేయండి లేకుంటే తప్పులు జరిగే అవకాశం. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ. ముఖ్య అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టండి. ఆరోగ్యంపట్ల శ్రద్ధ పెట్టండి. అధిక శ్రమ వలన తలనొప్పి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపడం లేదని మానసిక అశాంతి.

కన్యా రాశి : ఇతరులతో వాదోపవాదాలకు దిగకండి. ముఖ్యమైన నిర్ణయాలలో ఆత్మీయుల సలహాలు తీసుకోండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఆడంబరాల కోసం ఖర్చు పెట్టకండి. పాత సంఘటనల నుంచి గుణపాఠం నేర్చుకోవడం మంచిది. నూతన బాధ్యతల వలన వచ్చిన అధిక శ్రమను మరిచి సరైన ప్రణాళికతో ఆఫీసు పనులను పూర్తి చేయండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్తతో సంభాషించేటప్పుడు పాత గొడవలను గుర్తు చెయ్యకండి ఆయన మరింత మొండి వారవుతారు.

తులా రాశి : దీర్ఘకాలంగా నడుస్తున్న కోర్టు కేసు మీకు అనుకూలం. దుబారా, అనవసరపు ఖర్చులను నివారించండి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. బంధువులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆఫీసు పనులలో మీ శక్తిసామర్థ్యాలను అందరూ ప్రశంసిస్తారు. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. కొంతమంది ఉద్యోగ మార్పుకై చేస్తున్న ప్రయత్నాలు సఫలం. కొంతమందికి జీతాలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

వృశ్చిక రాశి : ఇతరుల నుంచి బహుమానాలు అందుకుంటారు. మానసిక అనారోగ్యాన్ని తరిమికొట్టండి కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. ఇంతకుముందు అప్పు తీసుకొని తీర్చని స్నేహితులకు మరల అప్పు ఇవ్వకండి. వ్యాపారస్తులకు శుభ శకునములు. ప్రభుత్వ సహాయం లభిస్తుంది. ఆఫీసు పనులలో అధిక శ్రమ ఉన్నప్పటికీ సరైన ప్రణాళికతో పూర్తిచేస్తారు. కుటుంబంలో పెద్ద వారి సలహాలు తీసుకోండి. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ. మీ తల్లి గారి ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చు పెట్టవలసి రావచ్చు.ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

ధనుస్సు రాశి : ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాలను తెస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆఫీసు పనులలో నిర్లక్ష్యం వద్దు తప్పులు జరిగే అవకాశం ఉంది సరైన ప్రణాళికతో పనులు పూర్తి చేయండి. మీ అహంభావంతో భార్యను చులకనగా చూడకండి. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అధిక శ్రమ వలన కాళ్ళనొప్పులు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన విషయం.

మకర రాశి : మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి. నిరాశావాద ధోరణి వలన ఏమీ సాధించలేరు. పట్టుదల ఆత్మవిశ్వాసం తో అన్ని కార్యాలను సాధిస్తారు. కొంతమంది ఉద్యోగం మార్పుకై చేస్తున్న ప్రయత్నాలు సఫలం. ఆఫీసు పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు అందరి ప్రశంసలు పొందుతారు. స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు. కావాల్సినంత ధనం చేతికందుతుంది పొదుపు చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. అధిక శ్రమ వలన తలనొప్పి కాళ్ల నొప్పులు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

కుంభ రాశి : ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కొంతమంది నూతన వాహనాలు కొంటారు. సంఘంలో పేరుప్రతిష్టలు. ఆదాయ వ్యవహారాలు పూర్తిగా మెరుగుపడతాయి. కొంతమంది ఉద్యోగులకు జీతాలు లో పెరుగుదల. వ్యాపారస్తులు మరింత లాభాల కోసం నూతన మార్గాలను అన్వేషిస్తారు. స్నేహితులతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇతరుల నుంచి బహుమానాలు అందుకుంటారు. విద్యార్థులు మీ పెద్ద వారి సలహాలు తీసుకోండి. వారి అనుభవం మీకు పనికి వస్తుంది. ఆఫీసు పనులను అధిక శ్రమ ఉన్నప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత గొడవలు మరిచిపోవడమే మంచిది.

మీన రాశి : ప్రతి విషయాన్ని డబ్బుతో కొలవకండి. డబ్బు ముఖ్యమే అయినా అది మానవసంబంధాలను పాడు చేయకూడదు. గందరగోళం వదిలివేయండి. సరైన ప్రణాళిక ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుపుతారు. ఆఫీసు పనులలో అధిక శ్రమ ఉన్నప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోండి బయట భోజనం వల్ల అజీర్తి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క హాస్యచతుర సంభాషణ మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.Next Story

Most Viewed