వేసవి అప్పుడే మొదలైపోయింది. ఎండల వల్ల వచ్చే వేడిని తట్టుకునేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వడ దెబ్బ తగలకుండా ఉండాలంటే చిన్నా, పెద్ద లిచీ పండ్ల జ్యూస్‌ను తాగాలి.
లిచీ పండ్లలో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఉండి వడదెబ్బ తగలకుండా రక్షిస్తాయి.
ఇందులో ఉండే విటమిన్లు కంటి చూపును మెరుగు పరుస్తాయి.
అధిక రక్తపోటుతో బాధపడేవారు లిచీ ఫ్రూట్స్‌ జ్యూస్ తాగితే మంచి ఫలితం లభిస్తుంది.
ఐరన్, ఫోలిక్ ఆమ్లం విటమిన్ బి12 ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి.
అలాగే లిచీ పండ్లు గుండె పోటు రాకుండా చేయడంతో పాటు మెదడు ఆరోగ్యంగా ఉండేలా సహాయపడతాయి.
లిచీ ఫ్యూట్స్ జ్యూస్‌ను అధికంగా తాగడం వల్ల మలబద్ధకం తగ్గి పేగు కదలికలు కూడా మెరుగుపడతాయి.