చీకటి ఎందుకు పడుతుంది?

ప్రతిరోజూ రాత్రి కాగానే చీకటి పడుతుంది.
అయితే, అసలింతకూ చీకటి ఎందుకు పడుతుంది అనే డౌట్ చాలామందిలో ఉంటుంది.
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. దీనినే భూభ్రమణం అంటారు.
భూభ్రమణానికి పట్టే కాలం 24 గంటల సమయం పడుతుంది.
చీకటి పడింది అంటే అర్థం ఆ సమయంలో భూమిమీద మనం ఉన్నవైపు సూర్యుని నుంచి క్రమేపి పక్కకు తిరుగుతోందని.
అంటే సూర్యుని కాంతి అక్కడ ప్రసరించదు. సూర్యుని కాంతి ప్రసరించనందున చీకటిగా అనిపిస్తుంది.