వాతావరణం చల్లగా ఉందని కాఫీ ఎక్కువగా తాగితే.. ఈ ప్రమాదాలు తప్పవు?

ప్రస్తుతం శీతాకాలం అందులోనూ మండూస్ తుఫాన్ కురుస్తోంది. దీని వల్ల వాతావరణం మొత్తం చల్లగా మారిపోయింది.
వాతావరణం చల్లగా ఉండటంతో చాలా మంది వేడి వేడిగా టీ, కాఫీలు తాగుతుంటారు.
ముఖ్యంగా కొంత మంది ఎక్కువ శాతం కాఫీనే ఇష్టపడుతుంటారు. దీంతో మాటిమాటికి కాఫీని తాగుతారు.
ఎక్కువగా కాఫీ తాగే వాల్లకు చాలా సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాఫీ అడ్రినల్ అనే హర్మోన్‌ విడుదల చేయడంతో ఆందోళనకు గురయ్యే అవకాశం ఎక్కువ. అంతేకాకుండా శరీరంలో వణుకు వస్తుంది.
దీనిని ఎక్కువగా తీసుకుంటే గ్యాస్, అజీర్ణం, ఆకలి వేయకపోవడం, గుండె జబ్బులు, విరోచనాలు వంటి సమస్యలు వస్తాయి.
కాఫీని ఎక్కువగా తాగేవారు నిద్రలేమిని ఎదుర్కోవాల్సి వస్తుంది.
కాఫీలో కెఫిన్ డ్రగ్ ఉంటుంది. దీని వల్ల ఎక్కువగా కాఫీలను తాగితే మానసిక, శారీరక ఇబ్బందుల్లో పడతారు.
కాబట్టి మెల్లమెల్లగా కాఫీని తాగడం తగ్గించుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.