నిమ్మ గింజలతో కలిగే అద్భుత ప్రయోజనాలివే?
అన్ని సీజన్లలో అందుబాటులో ఉండే నిమ్మకాయలతో పాటు పొట్టుతో చాలా లాభాలున్నాయని అందరికీ తెలిసిందే.
కానీ, నిమ్మకాయ రసంతో కన్న నిమ్మ గింజలతోనే చాలా ప్రయోజనాలు కలుగుతాయట.
నిమ్మ విత్తనాలను నీళ్లలో వేసి మరిగించి ఆ నీటిని తాగితే కిడ్నీ సమస్యలు, కీళ్ల నొప్పులు వంటివి తగ్గుతాయి.
నిమ్మ గింజల పొడిని ముఖానికి రాసుకోవాలి. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత కడిగేస్తే ఫేస్‌పై మెటిమలు, మచ్చలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది.
ఈ గింజల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఎక్కువగా ఉండి వైరస్‌ల వంటివి రాకుండా సహాయపడతాయి.
నిమ్మ గింజల పొడి నీటిలో వేసుకుని రోజూ తాగడం వల్ల కడుపులో ఉండే చిన్న చిన్న పురుగులు నశిస్తాయి.
అలాగే వీటిని పెనంపై వేయించి తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
నిమ్మ గింజల పౌడర్‌ను చర్మానికి రాసుకుంటే ఫంగల్ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.