కొబ్బరి నూనె ఇలా ఉపయోగించడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు..!
ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య హెయిర్ ఫాల్
దీన్ని అరికట్టేందుకు మార్కెట్‌లోకి వచ్చిన అనేక రకాల నూనెలు, షాంపులు ఉపయోగిస్తారు. కానీ జుట్టు రాలడం మాత్రం తగ్గదు
అయితే.. ఏవిధమైన పదార్థాలు కలపకుండా సాధారణమైన నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు రాలిపోవడాన్ని ఆపవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
జుట్టు పరిమాణాన్ని బట్టి ఒక కప్పులో నూనె తీసుకుని దాన్ని వేడినీటి గిన్నెలో పెట్టాలి. ఆ నూనె గోరు వెచ్చగా అయిన తర్వాత తలకు పెట్టుకోవాలి.
అయితే.. ఈ నూనెను తలకు అప్లై చేసేముందు జుట్టు చిక్కులు లేకుండా చూసుకోవాలి. తలలో తేమ, చెమట లాంటివి లేకుండా పొడిగా ఉన్న జుట్టుకు మాత్రమే అప్లై చేసుకోవాలి..
జుట్టుకు నూనెను మునివేళ్లతో అద్దుకుంటూ సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. జుట్టు కుదుళ్లు, మాడుకు పట్టేలాగా వృత్తాకారంగా వేళ్లను కదిలిస్తూ మసాజ్ చేసుకోవాలి.
ఇక తలకు నూనె పట్టించిన అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి..
ఇలా చేస్తే.. జుట్టు రాలడమనే సమస్య అస్సలు ఎదురు కాదు. అంతే కాకుండా.. రాత్రి నూనె అప్లై చేసి మార్నింగ్ తలస్నానం చేసినట్లుయితే మరింత ప్రభావంతంగా ఉంటుంది.